Telugu Global
Others

బాలయ్య శాపం అంజలికి తగులుతుందా..!

బాలయ్య సరసన సినిమా చేస్తే బోలెడంత క్రేజ్. అందులో ఎవరికీ డౌట్ లేదు. బాలకృష్ణ సరసన నటిస్తే నటనపరంగానూ అనేక విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కానీ… సదరు సినిమా హిట్టయినా, ఫ్లాపయినా… హీరోయిన్ కు మాత్రం నెగెటివ్ ఎఫెక్టే. గతంలో ఎన్నో సినిమాలతో ఈ విషయం రుజువైంది. ఇప్పుడు తాజాగా నటసింహతో సీతమ్మ అంజలి జతకట్టింది. డిక్టేటర్ సినిమాలో బాలయ్య సరసన ఆడిపాడింది. వెండితెరపై ఇద్దరి జంట చూడముచ్చటగా కనిపించింది. కానీ అంజలి భవిష్యత్ ఏంటి…? […]

బాలయ్య శాపం అంజలికి తగులుతుందా..!
X

బాలయ్య సరసన సినిమా చేస్తే బోలెడంత క్రేజ్. అందులో ఎవరికీ డౌట్ లేదు. బాలకృష్ణ సరసన నటిస్తే నటనపరంగానూ అనేక విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కానీ… సదరు సినిమా హిట్టయినా, ఫ్లాపయినా… హీరోయిన్ కు మాత్రం నెగెటివ్ ఎఫెక్టే. గతంలో ఎన్నో సినిమాలతో ఈ విషయం రుజువైంది. ఇప్పుడు తాజాగా నటసింహతో సీతమ్మ అంజలి జతకట్టింది. డిక్టేటర్ సినిమాలో బాలయ్య సరసన ఆడిపాడింది. వెండితెరపై ఇద్దరి జంట చూడముచ్చటగా కనిపించింది. కానీ అంజలి భవిష్యత్ ఏంటి…? బాలయ్యతో సినిమా చేసింది కాబట్టి… ఫ్యూచర్ మొత్తం ఫ్లాపులేనా… హిస్టరీ చూస్తే సెంటిమెంట్ ప్రకారం అంతే అంటున్నారు చాలామంది.

బాలయ్య గడిచిన నాలుగైదు సినిమాల లిస్ట్ చూస్తే…. ఏ హీరోయిన్నూ క్లిక్కయినట్టు దాఖలాల్లేవు. అధినాయకుడిలో ఆడిపాడిన లక్ష్మీరాయ్, సలోనీ ఏమైపోయారో ఎవరికీ తెలీదు. శ్రీమన్నారాయణతో మెరిసిన ఇషాచావ్లా, పార్వతి మెల్టన్ ప్రస్తుత పరిస్థితి అందరికీ తెలుసు. పాపం… పార్వతీ మెల్టన్ అయితే ఏకంగా దుకాణం సర్దేసింది. ఇక లెజెండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయినప్పటికీ హీరోయిన్లు రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్లకు కలిసొచ్చిందేం లేదు. తాజాగా లయన్ సినిమాలో బాలయ్య సరసన నటించిన త్రిష కూడా తెలుగులో మళ్లీ హవా చాటలేకపోయింది. అందాల కొండ నమిత విషయంలోనూ అదే జరిగింది. సో… ఈ ట్రాక్ రికార్డు చూస్తుంటే అంజలి ఫ్యూచర్ ఏంటనే భయం ఆమె అభిమానుల్ని పట్టిపీడిస్తోంది.

First Published:  14 Jan 2016 4:58 AM GMT
Next Story