Telugu Global
Cinema & Entertainment

షారుక్ ప‌క్కా ప్రాక్టిక‌ల్..!

తన వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం తన సినిమాల వసూళ్లపై ప్రభావం చూపిస్తోందని బహిరంగంగానే ఒప్పేసుకున్నాడు షారూక్ ఖాన్. దేశంలో అసహనం ఎక్కువవుతోందని కొంత కాలం తను చేసిన వ్యాఖ్యల ప్రభావం.. ఇటీవల విడుదల అయిన తన సినిమా ‘దిల్ వాలే’ వసూళ్లపై పడిందని షారూక్ విశ్లేషించాడు. తన మాటలతో కొన్ని కోట్ల మంది మనోభావాలను గాయపరిచాడు షారూక్. రాజకీయ ప్రమేయం ఉన్నట్టుగా ఉన్న షారూక్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. సినీ అభిమానుల నుంచి కూడా షారూక్ […]

షారుక్ ప‌క్కా ప్రాక్టిక‌ల్..!
X

తన వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం తన సినిమాల వసూళ్లపై ప్రభావం చూపిస్తోందని బహిరంగంగానే ఒప్పేసుకున్నాడు షారూక్ ఖాన్. దేశంలో అసహనం ఎక్కువవుతోందని కొంత కాలం తను చేసిన వ్యాఖ్యల ప్రభావం.. ఇటీవల విడుదల అయిన తన సినిమా ‘దిల్ వాలే’ వసూళ్లపై పడిందని షారూక్ విశ్లేషించాడు. తన మాటలతో కొన్ని కోట్ల మంది మనోభావాలను గాయపరిచాడు షారూక్. రాజకీయ ప్రమేయం ఉన్నట్టుగా ఉన్న షారూక్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే లేచింది. సినీ అభిమానుల నుంచి కూడా షారూక్ మాటలపై నిరసన స్వరం వినిపించింది.

అయితే అంత జరిగినా షారూక్ తన స్వరాన్ని సవరించుకోలేదు. తను చేసిన వ్యాఖ్యలపైనే ఆయన నిలబడ్డాడు. ఇన్ని రోజులూ షారూక్ ను ఒక ముస్లింగా గాక, తమవాడిగా.. తమలో ఒకడిగా చూసిన వారికి షారూక్ వ్యాఖ్యలు ఏ మాత్రం రుచించలేదు. కొంతమంది షారూక్ మాటలను సమర్థించినా.. అలాంటి వారి అభిప్రాయాలను మెజారిటీ ప్రజలు ఆమోదించలేదు. ఇన్ని రోజులూ ఆ విషయంపై స్పందించని షారూక్ ఇప్పుడు మాత్రం తన సినిమాకు వసూళ్లు తగ్గాయని బాధపడుతున్నాడు. ఇటీవల విడుదల అయిన ‘దిల్ వాలే’ ప్లాఫ్ కావడంపై స్పందిస్తూ.. ఇదంతా తన వ్యాఖ్యల ఫలితమే అనే అభిప్రాయం వ్యక్తం చేశాడు కింగ్ ఖాన్!

అంతేకాదు.. ఇకపై అలాంటి వ్యాఖ్యలు చేయనని కూడా షారూక్ స్పష్టం చేశాడు. మరి షారూక్ తను చేసిన వ్యాఖ్యల పట్ల నిజమైన కన్ఫెషన్ ను ఏమీ వ్యక్తం చేయడం లేదు. తన సినిమాలకు వసూళ్లు తగ్గాయి కాబట్టి.. తను అలా ఇకపై మాట్లాడను అని చెబుతున్నాడు. దీన్ని బట్టి ఆయన తనెంత కమర్షియలో.. తన సినిమాల వసూళ్ల కోసం తన అభిప్రాయాలను ఎలా దాచేసుకొంటానో.. షారూక్ వివరిస్తున్నాడు. మరి సినిమాల్లో ఉన్నత స్థాయి వ్యక్తిత్వంతో సూపర్ స్టార్ గా ఎదిగిన షారూక్ నిజ స్వరూపం ఇదా!

First Published:  13 Jan 2016 7:03 PM GMT
Next Story