Telugu Global
Cinema & Entertainment

డిక్టేట‌ర్  సినిమా ప్రివ్యూ

ఈ సంక్రాంతి రేసులో  భారీ అంచ‌నాల‌తో  విడుద‌ల‌వుతున్న చిత్రాల్లో డిక్టేట‌ర్  ఫ‌స్ట్ ప్లేస్ లో ఉందంటే అతిశ‌యోక్తి కాదు.  ప్ర‌పంచ వ్యాప్తంగా  దాదాపు 9 వంద‌ల స్క్రీన్స్ లో  ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఉద‌యం బెనిఫిట్ షోల‌తో  సినిమా ఎలా ఉందన్నది తెలిసిపోయింది.  బాల‌కృష్ణ మార్క్  యాక్ష‌న్ సీన్స్  కు డోకా లేకుండా చేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే క‌థ విష‌యంలో ఎలా ఉంది అనేది ఒక క్లారీటి  సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కూడా […]

డిక్టేట‌ర్  సినిమా ప్రివ్యూ
X
ఈ సంక్రాంతి రేసులో భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌వుతున్న చిత్రాల్లో డిక్టేట‌ర్ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉందంటే అతిశ‌యోక్తి కాదు. ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు 9 వంద‌ల స్క్రీన్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేశారు. అయితే ఉద‌యం బెనిఫిట్ షోల‌తో సినిమా ఎలా ఉందన్నది తెలిసిపోయింది. బాల‌కృష్ణ మార్క్ యాక్ష‌న్ సీన్స్ కు డోకా లేకుండా చేసిన‌ట్లు తెలుస్తుంది. అయితే క‌థ విష‌యంలో ఎలా ఉంది అనేది ఒక క్లారీటి సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో కూడా ఎవ‌రు రాయ‌క పోవ‌డంతో కొంత ఆస‌క్తి నెల‌కొంది.
ఇరోస్ ఇంట‌ర్నేష‌న‌లో సంస్థ ఫ‌స్ట్ టైమ్ తెలుగులో నిర్మించిన చిత్రం కావ‌డం.. బాల‌కృష్ణ కెరీర్ లో 50 కోట్ల‌కు పై బ‌డ్జెట్ తో సినిమా చేయ‌డం .. ట్రైలర్స్ సినిమా పై అంచ‌నాలు పెంచ‌డం వెర‌సీ డిక్టేట‌ర్ ఎలా ఉంటుంది. ఏ రేంజ్ విజ‌యం అందుకుంటుంది. ముఖ్యంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాను మించి బాక్సాఫీస్ రికార్డ్స్ కొడుతుందా లేదా అనే లెక్క‌లు ఫ్యాన్స్ వేసుకుంటున్నారు. అల్రేడి జూనియ‌ర్ ఎన్టీఆర్ చిత్రం బావుంది అనే టాక్ గెయిన్ చేసింది. కొన్ని మాస్ ఎలిమెంట్స్ లోపించిన‌ప్ప‌టికి నాన్నకు ప్రేమ‌తో హిట్ చిత్రంగా తేల్చేశారు.
మ‌రి బాల‌కృష్ణ డిక్టేట‌ర్ చిత్రంలో వినోదానికి ఢోకా లేద‌నేది ఇప్ప‌టి వ‌ర‌కు తెలిసిన స‌మాచారం. పూర్తిగా సినిమా ద‌మ్ము ఎంటి అనేది తెలియాలంటే మ‌రో కొద్ది గంట‌లు వెయిట్ చేయాలి.
First Published:  14 Jan 2016 12:14 AM GMT
Next Story