Telugu Global
Others

"నాన్నకు ప్రేమతో"కట్టడికి తమ్ముళ్ల కొత్తఎత్తు?

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంపై కత్తికట్టిన టీడీపీలోని ఒక వర్గం అందుకు రకరకాల ఎత్తులేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇందుకోసం పక్కాప్లాన్ సిద్ధం చేశారు తమ్ముళ్లు. స్క్రీన్ల సంఖ్య రూపంలో ఎన్టీఆర్‌ చిత్రాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 13న ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుండగా… మరుసటి రోజు బాలయ్య డిక్టేటర్ రాబోతోంది. డిస్టిబ్యూటర్లు తొలుత అనుకున్నది ఏమిటంటే… 13న దాదాపు అన్నిస్క్రీన్లపై జూనియర్ చిత్రాన్ని ప్రదర్శించాలని భావించారు. మరుసటి రోజు బాలయ్య చిత్రం కోసం కొన్నిస్క్రీన్లను ఖాళీ చేయాలని […]

నాన్నకు ప్రేమతోకట్టడికి తమ్ముళ్ల కొత్తఎత్తు?
X

ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రంపై కత్తికట్టిన టీడీపీలోని ఒక వర్గం అందుకు రకరకాల ఎత్తులేస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇందుకోసం పక్కాప్లాన్ సిద్ధం చేశారు తమ్ముళ్లు. స్క్రీన్ల సంఖ్య రూపంలో ఎన్టీఆర్‌ చిత్రాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 13న ఎన్టీఆర్ సినిమా విడుదలవుతుండగా… మరుసటి రోజు బాలయ్య డిక్టేటర్ రాబోతోంది. డిస్టిబ్యూటర్లు తొలుత అనుకున్నది ఏమిటంటే… 13న దాదాపు అన్నిస్క్రీన్లపై జూనియర్ చిత్రాన్ని ప్రదర్శించాలని భావించారు. మరుసటి రోజు బాలయ్య చిత్రం కోసం కొన్నిస్క్రీన్లను ఖాళీ చేయాలని భావించారు.

అయితే డిస్టిబ్యూటర్లపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చి కొత్త ఎత్తు వేశారు. డిక్టేటర్ కోసం ఇదివరకు అనుకున్నట్టు కాకుండా భారీ స్థాయిలో స్క్రీన్లు కేటాయించేలా డిస్టిబ్యూటర్లను ఒత్తిడి తెచ్చి ఒప్పించారు. అంటే డిక్టేటర్ కోసం నాన్నకు ప్రేమతో స్కీన్లు భారీగా తగ్గించనున్నారన్న మాట. పైగా అదే సమయంలో సోగ్గాడే చిన్నినాయన, ఎక్స్‌ప్రెస్ రాజా రాబోతున్నాయి. వీటి కోసం కూడా స్క్రీన్లు కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఎటుపోయి చివరకు ఎన్టీఆర్ సినిమాకు చాలా తక్కువ స్క్రీన్లు దక్కేలా టీడీపీలోని ఒక వర్గం పావులు కదుపుతోందని జూనియర్ అభిమానుల ఆవేదన. నాన్నకు ప్రేమతో బడ్జెట్‌ 50 కోట్లు దాటిందని ఈ సమయంలో వీలైనన్నీ ఎక్కువ స్క్రీన్లపై సినిమా ఆడాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

దీన్ని అదునుగా తీసుకునే స్క్రీన్లు తగ్గించి ఎన్టీఆర్ చిత్రాన్ని దెబ్బతీయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఒక్కసారి సినిమా హిట్‌ టాక్ వస్తే స్క్రీన్లు తగ్గింపు వంటి అంశాలు సినిమా విజయాన్ని అడ్డుకోలేవని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ చిత్రాల్లో ఏది పైచేయి సాధిస్తున్నందన్న అంశం ఆయా సినిమాల్లోని సరుకుపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

First Published:  11 Jan 2016 11:17 PM GMT
Next Story