Telugu Global
Others

ఇంట్లో అశాంతి... పిల్ల‌ల ఆరోగ్యంపై ప్ర‌భావం!

ఇంట్లో అమ్మానాన్న‌ల ఆప్యాయ‌త‌ల మ‌ధ్య పెరిగిన పిల్ల‌ల్లో ఆత్మ‌విశ్వాసం, జీవితంప‌ట్ల న‌మ్మ‌కం, భ‌విష్య‌త్తు ప‌ట్ల భ‌ద్ర‌త ఇవ‌న్నీ త‌గిన స్థాయిలో ఉంటాయి. అలా కాకుండా ప‌సిత‌నంలో పిల్ల‌లు,  త‌ల్లిదండ్రులు పోటాడుకోవ‌డం, కీచులాట‌లు,  ఆత్మ‌హ‌త్య‌లు, విడాకులు లాంటి ప‌రిస్థితుల‌ను చూస్తూ పెరిగితే అవి వారి ఆరోగ్యం మీద,  జీవిత‌కాలం మీద, వారి భ‌విష్య‌త్తు మీద  ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు గృహ‌హింస‌ని ఎదుర్కొంటున్న సంద‌ర్భాల్లో ఆ ప్ర‌భావం పిల్ల‌ల‌పై ఎంత దారుణంగా ప‌డుతుందో శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నంలో […]

ఇంట్లో అశాంతి... పిల్ల‌ల ఆరోగ్యంపై ప్ర‌భావం!
X

ఇంట్లో అమ్మానాన్న‌ల ఆప్యాయ‌త‌ల మ‌ధ్య పెరిగిన పిల్ల‌ల్లో ఆత్మ‌విశ్వాసం, జీవితంప‌ట్ల న‌మ్మ‌కం, భ‌విష్య‌త్తు ప‌ట్ల భ‌ద్ర‌త ఇవ‌న్నీ త‌గిన స్థాయిలో ఉంటాయి. అలా కాకుండా ప‌సిత‌నంలో పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు పోటాడుకోవ‌డం, కీచులాట‌లు, ఆత్మ‌హ‌త్య‌లు, విడాకులు లాంటి ప‌రిస్థితుల‌ను చూస్తూ పెరిగితే అవి వారి ఆరోగ్యం మీద, జీవిత‌కాలం మీద, వారి భ‌విష్య‌త్తు మీద ప్ర‌భావాన్ని చూపుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. ముఖ్యంగా మ‌హిళ‌లు గృహ‌హింస‌ని ఎదుర్కొంటున్న సంద‌ర్భాల్లో ఆ ప్ర‌భావం పిల్ల‌ల‌పై ఎంత దారుణంగా ప‌డుతుందో శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నంలో రుజువైంది.

మ‌న శ‌రీర క‌ణాల్లో వ‌య‌సు పెరుగుద‌ల‌ను సూచించే టెలోమీర్స్ అనే భాగం, ప్ర‌శాంత‌త లేని ఇళ్ల‌లో పుట్టి పెరిగిన‌వారిలో పొట్టిగా ఉన్న‌ట్టుగా సైంటిస్టులు గుర్తించారు. ఈ టెలోమీర్స్ పొట్టిగా ఉంటే స్థూల‌కాయం, గుండెజ‌బ్బులు, తెలివితేట‌ల లోపం, మ‌ధుమేహం, పెద్ద‌వుతున్న కొద్దీ ప‌లు అనారోగ్యాలు…ఈ స‌మస్య‌ల‌న్నీ ఉంటాయి.

శాస్త్ర‌వేత్త‌లు 5నుండి 10 సంవ‌త్స‌రాల లోపు వ‌య‌సున్న 80మంది పిల్ల‌ల జ‌న్యు శాంపిల్స్‌ని తీసుకుని ప‌రీక్షించారు. అలాగే ఆయా పిల్ల‌లు పెరిగిన వాతావ‌ర‌ణం గురించి తెలుసుకునేందుకు వారి త‌ల్లిదండ్రుల‌ను ప్ర‌శ్నించారు. ఇంట్లో త‌ల్లిదండ్రులు కొట్టుకోవ‌డం, తిట్టుకోవ‌డంతో పాటు ఆత్మ‌హ‌త్య‌ల వంటి దారుణాల‌ను చూసిన పిల్ల‌ల డిఎన్ఎపై ఆ ప్ర‌భావం స్ప‌ష్టంగా ఉన్న‌ట్టుగా వారు గుర్తించారు. ఎంత ఎక్కువ‌గా అలాంటి ప‌రిస్థితుల‌ను చూసి ఉంటే పిల్ల‌ల డిఎన్ఎలో అంత‌గా టెలోమీర్స్ పొట్టిగా ఉన్న‌ట్టుగా చూశారు. ఇవి పొట్టిగా ఉన్న పిల్ల‌లు పెద్ద‌య్యాక ఆర్థికంగా ఎద‌గ‌లేక‌పోవ‌డం, అనారోగ్యాల పాల‌వడం, తిరిగి ఆ ప్ర‌భావం వారి పిల్ల‌ల మీద ప‌డ‌టం…ఇవ‌న్నీ జ‌రుగుతాయ‌ని మ‌నం ముందుగానే ఊహించ‌వ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

కుటుంబంలో హింస‌ని చూస్తూ పెరిగిన అమ్మాయిల్లో టెలోమీర్స్ మ‌రింత పొట్టిగా ఉన్న‌ట్టుగా గ‌మ‌నించారు. అయితే త‌ల్లులు ఉన్న‌త చ‌దువులు చ‌దివినపుడు వారి కొడుకుల డిఎన్ఎలో పూర్తి పాజిటివ్ ప్ర‌భావం గ‌మ‌నించారు. కేవ‌లం కొడుకుల్లోనే, అదీ ప‌దేళ్ల‌లోపు పిల్ల‌ల్లో టెలోమీర్స్ పొడ‌వు పెరిగిన‌ట్టుగా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. మొత్తానికి పిల్ల‌ల‌కు ఇంట్లో ప్రేమ పూరిత వాతావ‌ర‌ణాన్ని అందించ‌డ‌మే త‌ల్లిదండ్రులు వారికిచ్చే అస‌లైన దీవెన అని దీన్నిబ‌ట్టి తెలుస్తోంది.

First Published:  12 Jan 2016 9:35 AM GMT
Next Story