Telugu Global
Cinema & Entertainment

మన ఊరికి మనీషా వచ్చేస్తోంది

క్రిమినల్, భారతీయుడు, బొంబాయి, ఒకే ఒక్కడు లాంటి ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా రీఎంట్రీకి సిద్ధమౌతోంది. గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ… ఇప్పుడు పూర్తిగా ఆ జబ్బు నుంచి కోలుకున్న మనీషా కొయిరాలా త్వరలోనే సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ఆమె ఇంటర్నెట్ లో బ్లాగ్స్ రాసేందుకు ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఆ ఒప్పందం పూర్తవ్వడంతో…. సినిమాల్లో నటించేందుకు సిద్ధమౌతోంది. నిజానికి ఆమెకు బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు […]

మన ఊరికి మనీషా వచ్చేస్తోంది
X
క్రిమినల్, భారతీయుడు, బొంబాయి, ఒకే ఒక్కడు లాంటి ఎన్నో సినిమాలతో ఆకట్టుకున్న మనీషా కొయిరాలా రీఎంట్రీకి సిద్ధమౌతోంది. గడిచిన కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతూ… ఇప్పుడు పూర్తిగా ఆ జబ్బు నుంచి కోలుకున్న మనీషా కొయిరాలా త్వరలోనే సౌత్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ఆమె ఇంటర్నెట్ లో బ్లాగ్స్ రాసేందుకు ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా ఆ ఒప్పందం పూర్తవ్వడంతో…. సినిమాల్లో నటించేందుకు సిద్ధమౌతోంది. నిజానికి ఆమెకు బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయి. అయితే రీఎంట్రీలో మొదట సౌత్ లో నటించి….. తర్వాత బాలీవుడ్ కువెళ్లాలనే ఆలోచనలో ఉంది మనీషా కొయిరాలా. ప్రస్తుతం తమిళ దర్శకుడు బాల చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే నాగార్జున రిఫరెన్స్ తో ఓ తెలుగు సినిమాలో కూడా నటించే ఆలోచనలో ఉంది. సో… మనీషా కొయిరాలను త్వరలోనే మన ఊరి థియేటర్లలో చూడబోతున్నాం.
First Published:  10 Jan 2016 7:20 PM GMT
Next Story