Telugu Global
Cinema & Entertainment

పదేళ్లలోపు పిల్లలకు సూర్య సినిమా టిక్కెట్‌ ఫ్రీ

సామాజిక స్పృహ అధికంగా ఉన్నహీరోల్లో సూర్య ఒకరు. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న సూర్య పేద పిల్లల కోసం మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. అదేంటంటే… సూర్య నటించి, నిర్మించిన బాలల చిత్రం ‘పసంగ-2’ చక్కని సందేశాత్మక చిత్రంగా ప్రశంసలందుకుంటూ కమర్షియల్‌గానూ సక్సెస్‌ సాధించింది. ఈ ఆనందంలో దర్శకుడు పాండిరాజ్‌కి రెండ్రోజుల క్రితం కారు బహుమతిగా ఇచ్చారు సూర్య. ఇప్పుడు ‘పసంగ-2’ చిత్రాన్ని టిక్కెట్‌ లేకుండానే పిల్లలు వీక్షించే ఏర్పాట్లు చేశారు. శనివారం […]

పదేళ్లలోపు పిల్లలకు సూర్య సినిమా టిక్కెట్‌ ఫ్రీ
X

సామాజిక స్పృహ అధికంగా ఉన్నహీరోల్లో సూర్య ఒకరు. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న సూర్య పేద పిల్లల కోసం మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. అదేంటంటే… సూర్య నటించి, నిర్మించిన బాలల చిత్రం ‘పసంగ-2’ చక్కని సందేశాత్మక చిత్రంగా ప్రశంసలందుకుంటూ కమర్షియల్‌గానూ సక్సెస్‌ సాధించింది. ఈ ఆనందంలో దర్శకుడు పాండిరాజ్‌కి రెండ్రోజుల క్రితం కారు బహుమతిగా ఇచ్చారు సూర్య. ఇప్పుడు ‘పసంగ-2’ చిత్రాన్ని టిక్కెట్‌ లేకుండానే పిల్లలు వీక్షించే ఏర్పాట్లు చేశారు. శనివారం నుండి 10 ఏళ్లలోపు పిల్లలందరూ ‘పసంగ-2’ థియేటర్లలో ఉచితంగా సినిమా చూడొచ్చని ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతానికి కోవై, తిరుచ్చి, తంజావూరు, తిరునల్వేలి, కన్యాకుమారి, దక్షిణ ఆర్కాడులోని థియేటర్లకే పరిమితమైన ఈ ఆఫర్‌ను రాబోయే రోజుల్లో ఇతర ప్రాంతాలకూ విస్తరించనున్నట్లు సూర్య సన్నిహితులు చెప్పారు. కాగా, ఈ చిత్రం తెలుగులో ‘మేము’ పేరుతో విడుదల కాబోతుంది.

Next Story