Telugu Global
Cinema & Entertainment

చచ్చినా ఆ టైపు గడ్డం పెంచను

నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పెంచిన గడ్డం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమాకు మొట్టమొదటి ప్రమోషన్ ఎలిమెంట్ కూడా ఆ గడ్డమే. ఆ ఫస్ట్ లుక్ తోనే నాన్నకు ప్రేమతో సినిమాకు ఓ లుక్ వచ్చేసింది. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ఆ గడ్డాన్ని తన నెక్ట్స్ సినిమాలో కూడా తారక్ కంటిన్యూ చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ అనే సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాలో కూడా అదే […]

చచ్చినా ఆ టైపు గడ్డం పెంచను
X
నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పెంచిన గడ్డం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమాకు మొట్టమొదటి ప్రమోషన్ ఎలిమెంట్ కూడా ఆ గడ్డమే. ఆ ఫస్ట్ లుక్ తోనే నాన్నకు ప్రేమతో సినిమాకు ఓ లుక్ వచ్చేసింది. అంతటి ప్రాధాన్యం సంతరించుకున్న ఆ గడ్డాన్ని తన నెక్ట్స్ సినిమాలో కూడా తారక్ కంటిన్యూ చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ అనే సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమాలో కూడా అదే గడ్డంతో కనిపిస్తాడని వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదంటున్నాడు తారక్. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలోనే ఆ గడ్డాన్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడ్డానని, మరో సినిమా కోసం మళ్లీ దాన్ని కంటిన్యూ చేయడం తన వల్ల కాదన్నాడు. అయినప్పటికీ… జనతా గ్యారేజీ కథకు ఆ స్టయిల్ గడ్డం బాగుండదని కూడా అంటున్నాడు. మొత్తమ్మీద…. నాన్న కోసం పెంచిన గడ్డాన్ని ఈమధ్యే వదిలించుకోగలిగాడు తారక్.
Next Story