Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య డిక్టేట్ చేస్తాడా ?

బాల‌య్య‌,  నాగార్జున  ఇద్ద‌రు  సూప‌ర్  స్టార్స్. అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ వున్న వాళ్లే. క‌ట్ చేస్తే   వీరిద్ద‌రి మ‌ధ్య‌..  గ‌తంలో   ఒక సినిమా విష‌యంలో కొంత  అభిప్రాయ భేదాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  నాగార్జున శిరిడి సాయి  చిత్రం విడుద‌ల స‌మ‌యంలో…  అప్ప‌టికే  రిలీజై న బాల‌కృష్ణ న‌టించిన శ్రీ‌మ‌న్నారాయ‌న చిత్రాన్ని సిటీలో  కొన్ని థియేట‌ర్స్ లో  రిమూవ్ చేయించాడ‌నే ర‌భ‌స జ‌రిగింది.   అప్ప‌టి నుంచి  బాల‌య్య‌, నాగార్జున  ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు […]

బాల‌య్య డిక్టేట్ చేస్తాడా ?
X
బాల‌య్య‌, నాగార్జున ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్. అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ వున్న వాళ్లే. క‌ట్ చేస్తే వీరిద్ద‌రి మ‌ధ్య‌.. గ‌తంలో ఒక సినిమా విష‌యంలో కొంత అభిప్రాయ భేదాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. నాగార్జున శిరిడి సాయి చిత్రం విడుద‌ల స‌మ‌యంలో… అప్ప‌టికే రిలీజై న బాల‌కృష్ణ న‌టించిన శ్రీ‌మ‌న్నారాయ‌న చిత్రాన్ని సిటీలో కొన్ని థియేట‌ర్స్ లో రిమూవ్ చేయించాడ‌నే ర‌భ‌స జ‌రిగింది. అప్ప‌టి నుంచి బాల‌య్య‌, నాగార్జున ఇద్ద‌రు ఒక‌రికి ఒక‌రు కాస్త ఎడ మోహాం పెడ మొహంగా వుంటున్నారు.
క‌ట్ చేస్తే వీరిద్ద‌రు ఈ సారి సంక్రాంతి పండ‌గ రోజు త‌మ చిత్రాల‌తో వ‌స్తున్నారు. బాల‌కృష్ణ త‌న‌దైన యాక్ష‌న్ ప్యాకేజ్ తో వ‌స్తుండ‌గా…నాగార్జున సొగ్గాడే చిన్నినాయ‌నా అంటూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేస్తూ వ‌స్తున్నాడు. ఈసారి నాగ్ చిత్రానికంటే బాల‌య్య సినిమాకే 3 వంద‌ల స్క్రీన్స్ అధికంగా వున్నాయి. ఇరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ వాళ్లు బాల‌య్య చిత్రాన్ని నిర్మించ‌డంతో థియేట‌ర్ల ప‌రంగా పండ‌క్కి విడుద‌ల అవుతున్న చిత్రాల్లో డిక్టేట‌ర్ వే ఎక్కువ . ఇదిలా వుంటే.. బాల‌య్య అభిమానులు మాత్రం డిక్టేట‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని కోరుకుంటున్నారు. నాగార్జున ఫ్యాన్స్ అయితే కూల్ గా వున్నారు. ఎందుకంటే సొగ్గాడే చిన్నినాయ‌న ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ చేసుకుని వ‌స్తుంది. అల్రేడి పాజిటివ్ టాక్ వ‌చ్చేసింది. ముగ్గురు హీరోయిన్స్ . ఎలా చూసిన సొగ్గాడే సంక్రాంతికి క‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నారు. మొత్తం మీద ఒక వేళ బాల‌య్య సినిమాను క‌లెక్ష‌న్ల ప‌రంగా నాగార్జున చిత్రం ఓవ‌ర్ టేక్ చేసిందంటే… బాల‌య్య అభిమానుల‌కు గొంతులో య‌ల‌క్కాయి ప‌డిన‌ట్లే అంటున్నారు ప‌రిశీలకులు.
Next Story