Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి 2 లో 30 ఇయ‌ర్స్  పృధ్వీ..!

బాహుబలి.. ది కంక్లూజన్‌’లో పృథ్వీ.. గత వారం పది రోజులుగా మీడియాలో ఈ వార్త హల్‌ చల్‌ చేసేస్తోంది. ‘సౌఖ్యం’ సినిమాలో బాహుబలి స్ఫూఫ్‌ వీడియో చూసి రాజమౌళి ఫిదా అయిపోయాడని.. ఈ మధ్య కాలంలో పృథ్వీ క్యారెక్టర్లు కూడా జక్కన్నకు నచ్చేశాయని.. ఈ నేపథ్యంలోనే అతణ్ని బాహుబలి-2లోకి తీసుకున్నాడని రకరకాలుగా వార్తలు పుట్టించేశారు. కానీ వాస్తవం ఏంటంటే.. బాహుబలి-2లో పృథ్వీ నటించట్లేదు. రాజమౌళి కామెడీ కోసం పృథ్వీని తీసుకున్నాడన్నదే పెద్ద కామెడీ అని ఆ యూనిట్‌ […]

బాహుబ‌లి 2 లో 30 ఇయ‌ర్స్  పృధ్వీ..!
X

బాహుబలి.. ది కంక్లూజన్‌’లో పృథ్వీ.. గత వారం పది రోజులుగా మీడియాలో ఈ వార్త హల్‌ చల్‌ చేసేస్తోంది. ‘సౌఖ్యం’ సినిమాలో బాహుబలి స్ఫూఫ్‌ వీడియో చూసి రాజమౌళి ఫిదా అయిపోయాడని.. ఈ మధ్య కాలంలో పృథ్వీ క్యారెక్టర్లు కూడా జక్కన్నకు నచ్చేశాయని.. ఈ నేపథ్యంలోనే అతణ్ని బాహుబలి-2లోకి తీసుకున్నాడని రకరకాలుగా వార్తలు పుట్టించేశారు. కానీ వాస్తవం ఏంటంటే.. బాహుబలి-2లో పృథ్వీ నటించట్లేదు. రాజమౌళి కామెడీ కోసం పృథ్వీని తీసుకున్నాడన్నదే పెద్ద కామెడీ అని ఆ యూనిట్‌ నుంచి సమాచారం అందుతోంది.

బాహుబలి తరహా సినిమాల్ని జనాలు కామెడీ కోసం చూడరని.. దాని ప్రత్యేకత దానికి ఉందని.. ఇక కొత్తగా కామెడీ ఏమీ జోడించాల్సిన పని లేదని.. అసలు ‘బాహుబలి-2’లో చెప్పుకోదగ్గ కొత్త క్యారెక్టర్లేమీ కూడా లేవని.. పృథ్వీ ఈ సినిమాకు యాడ్‌ అవుతున్నాడన్నది శుద్ధ అబద్ధమని యూనిట్‌ సభ్యుడొకరు వెల్లడించారు. కాబట్టి బాహుబలి-2 విషయంలో జోకులు ఆపేస్తే బెటర్‌ అన్నమాట. ఇక ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ షూటింగ్‌ విషయానికొస్తే.. రామోజీ ఫిలిం సిటీలో మొదలైన ఫస్ట్‌ షెడ్యూల్లో పెద్దగా షూటింగేమీ జరగలేదట. చిన్న చిన్న సన్నివేశాలు చిత్రీకరించి.. తర్వాతి షెడ్యూల్‌ ప్లానింగ్‌లోనే బిజీ బిజీగా గడిపేస్తున్నాడట జక్కన్న. ఫిబ్రవరిలో మొదలయ్యే కేరళ షెడ్యూల్‌తో షూటింగ్‌ ఊపందుకుంటుంది.

First Published:  8 Jan 2016 1:01 PM GMT
Next Story