Telugu Global
Cinema & Entertainment

హీరో రామ్ రాంగ్ స్టెప్ వేశాడా..!

సెలిబ్రీటలు  మీడియాతో  సత్ సంబంధాలు క‌లిగి ఉండ‌టం అనేది  ఒక ఫార్మేట్ .  మీడియాకు ఎదురెళ్లి గెల‌వ‌డం క‌ష్టం. అందుకే  కొందిరికి మీడియా చేసే కొన్ని విష‌యాలు న‌చ్చ‌క పోయినా..ఎందుకొచ్చిన త‌ల‌నొప్పి అని  సైలెంట్ గా ఉంటారు. కానీ   యంగ్ హీరో రామ్ .. నేను శైల‌జ చిత్రం విష‌యంలో ఒక చానెల్  త‌న సినిమా పై పూర్తిగా వ్య‌తిరేకంగా రాసింద‌ని  .. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో  బాహాటంగా తన ఎటాక్ ను మొద‌లెట్టాడు.  ఆ […]

హీరో రామ్ రాంగ్ స్టెప్ వేశాడా..!
X

సెలిబ్రీటలు మీడియాతో సత్ సంబంధాలు క‌లిగి ఉండ‌టం అనేది ఒక ఫార్మేట్ . మీడియాకు ఎదురెళ్లి గెల‌వ‌డం క‌ష్టం. అందుకే కొందిరికి మీడియా చేసే కొన్ని విష‌యాలు న‌చ్చ‌క పోయినా..ఎందుకొచ్చిన త‌ల‌నొప్పి అని సైలెంట్ గా ఉంటారు. కానీ యంగ్ హీరో రామ్ .. నేను శైల‌జ చిత్రం విష‌యంలో ఒక చానెల్ త‌న సినిమా పై పూర్తిగా వ్య‌తిరేకంగా రాసింద‌ని .. సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో బాహాటంగా తన ఎటాక్ ను మొద‌లెట్టాడు. ఆ చానెల్లో ఉద్యోగి రామ్ అభిమాని కావ‌డంతో.. ప్రొగ్రామ్ ఎలా చేశారు..ఎంత నెగిటివ్ గా రాయించి యూ ట్యూబ్ లో పెట్టారు వంటి స‌మాచారం ఆ చానెల్లో ఎంప్లాయ్ రామ్ కు తెలియ ప‌రిచ‌డంతో.. చానెల్ వాళ్లు అత‌న్ని ఉద్యోగం నుంచి తీసేశారట‌.ఓ సంస్థ తన ఉద్యోగిని క్రమశిక్షణా వ్యవహారం కింద తీయడం అన్నది చాలా సులువైన సంగతి. ఎందుకంటే ప్రయివేటు ఉద్యోగాలే అంత..తుమ్మితే ఊడిపోయే ముక్కులు.

ఆ ఉద్యోగి రామ్ ఫ్యాన్ కావ‌డంతో ..రామ్ కు ఈ విషయం చెప్పినట్లున్నాడు. వెంటనే మరో ఉద్యోగం దొరికే వరకు తాను జీతం ఇస్తానని హామీ ఇచ్చాడు. మంచిదే ఓ అభిమాని కోసం హీరో ఇలా ముందుకు రావడం మెచ్చుకోదగ్గ సంగతే ( రామ్ ఇదే విష‌యాన్ని ట్విట్ చేశాడు).కానీ రామ్ అక్కడితో ఊరుకోలేదు..ఈ విషయాన్ని ఛానెల్ పేరుతో సహా ట్విట్టర్ కు ఎక్కించాడు. మరి సహజంగానే ఆ ఛానెల్ ఏదో ఒకటి కౌంటర్ ఇస్తుంది. తప్పదు కదా..? సో ఇండైరెక్ట్ గా ఆ చానెల్ కు ..రామ్ కు వార్ ప్రారంభం అయిన‌ట్లే క‌దా.! మ‌రి ఇంకా ఎంతో కెరీర్ ఉన్న రామ్ ఎంత కాలం ఆ చానెల్ రియ‌ల్ గా టార్గెట్ చే్స్తే త‌ట్టుకో గ‌లుగుతాడో వేచి చూడాల్సిందే..!

First Published:  8 Jan 2016 7:11 PM GMT
Next Story