Telugu Global
Cinema & Entertainment

క్లాష్ ఆఫ్ టైటాన్స్..! 

బాలీవుడ్ లో పెద్ద నటీ న‌టుల సినిమాలు ఓకేరోజున విడుద‌లై సంచ‌ల‌నాలు క‌లిగిస్తూ వుంటాయి.ఈ మ‌ధ్యే క్రిస్ట‌మ‌స్ కు విడుద‌లైన రెండూ భారీ సినిమాలు దిల్ వాలే, బాజీరావుమ‌స్తానీ విష‌యంలో షారుక్ , సంజ‌య్ లీలా భ‌న్సాలీల‌కు పంపీణి దారుల‌కు ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే రెండు సినిమాలు విజ‌య‌వంతం కావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా 2016 సంవ‌త్స‌రంలో విడుద‌ల కానున్న సెల‌బ్రిటీల సినిమాలు వివ‌రాలు వెలువ‌డ్డాయి. వాటి భ‌విత‌వ్యం యెలా ఉండ‌బోతుందో కాల‌మే నిర్ణ‌యించాలి. […]

క్లాష్ ఆఫ్ టైటాన్స్..! 
X
బాలీవుడ్ లో పెద్ద నటీ న‌టుల సినిమాలు ఓకేరోజున విడుద‌లై సంచ‌ల‌నాలు క‌లిగిస్తూ వుంటాయి.ఈ మ‌ధ్యే క్రిస్ట‌మ‌స్ కు విడుద‌లైన రెండూ భారీ సినిమాలు దిల్ వాలే, బాజీరావుమ‌స్తానీ విష‌యంలో షారుక్ , సంజ‌య్ లీలా భ‌న్సాలీల‌కు పంపీణి దారుల‌కు ఉద్రిక్త‌త నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అయితే రెండు సినిమాలు విజ‌య‌వంతం కావ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా 2016 సంవ‌త్స‌రంలో విడుద‌ల కానున్న సెల‌బ్రిటీల సినిమాలు వివ‌రాలు వెలువ‌డ్డాయి. వాటి భ‌విత‌వ్యం యెలా ఉండ‌బోతుందో కాల‌మే నిర్ణ‌యించాలి. ఈ నెల 22న ర‌ణ‌బీర్ క‌పూర్ -క‌త్రీనా కైఫ్ న‌టించిన అనురాగ్ బ‌స్ చిత్రం 'జ‌గ్గా జాసూస్', విడుద‌ల అవుతుండ‌గా.. అక్ష‌య్ కుమార్ న‌టించిన కామెడీ చిత్రాల సిరిస్‌ 'హౌస్ ఫుల్' -3 కూడా అదే రోజు విడుద‌ల కానుంది.
జ‌న‌వ‌రి 20 న మ‌రొక క్లాష్ కూడా ఉంది. ఆర్ మాధ‌వ‌న్ స్టోర్ట్స్ డ్ఆర‌మ్ 'సాలా ఖాదూస్' తుషారు క‌పూర్ న‌టించిన 'మ‌స్తీ జాదే' సినిమాలు త‌మ భవిత‌వ్యానీ నిర్ణ‌యించుకోనున్నాయి. మే 13 న షారుక్ ఖాన్ న‌టించిన క్రైమ్‌ థ్రిల్ల‌ర్ 'రయిస్' స‌ల్మాన్ న‌టించిన ప‌హిల్వాన్ క‌థాంశం 'సుల్తాన్' తో పోటి ప‌డుతుంది. జూన్ 3న క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ‌బీర్ క‌పూర్, అనుష్క శ‌ర్మ, ఐశ్వ‌ర్య రాయ్ న‌టిస్తున్న 'ఆయే దిల్ హై ముష్కిల్' సినిమాకు పోటిగా అజ‌య్ దేవ‌గ‌న్ న‌టించే 'శివాయ్' విడుద‌ల కానుంది. ఆగ‌స్టు 12న హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ న‌టించిన 'మిర్హా సాహిబా' విషాద ప్రేమ కావ్యం విడుద‌ల కాబోతుంద‌గా.. అదేరోజు ఇమ్రాన్ హ‌ష్మీ న‌టించిన క్రికెట్ యోధుడు 'అజారుద్దీన్ బ‌యోపిక్' గ‌ట్టి పోటి ఇవ్వ‌నుంది. దీపావళీ పండుగ రోజు సింధూ నాగ‌రిక‌త‌కు అద్దం ప‌ట్టే హృతిక్ రోష‌న్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'మొహంజోదారో'విడుద‌ల కానుండ‌గా..అదే రోజు అక్ష‌య్ కుమార్ లీడ్ రోల్ లో వ‌స్తున్న రోమాంటిక్ థ్రిల్ల‌ర్ 'రుస్తం' సినిమా పోటి ప‌డునుంది. మ‌రి భారీ చిత్రాల పోటిలో ఏ సినిమాలు విజ‌య కేత‌నం ఎగ‌ర‌వేస్తాయో లెట్స్ వెయిట్ అండ్ సీ.
Next Story