Telugu Global
Others

మేధావుల కుల అసహనం

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కుల అసహనం తీవ్రస్థాయికి చేరింది. సీపీయం నాయకుడు మధు, చంద్రబాబు పాలనలోని లోపాలను నిరంతరం ఎత్తిచూపడంతో వాటికి సమాధానం చెప్పలేక, వాళ్లను వాళ్ళు సరిదిద్దుకోలేక మధుమీద కులంబురదచల్లే కార్యక్రమానికి తెరతీశారు. టీడీపీ నాయకులు మధు రెడ్డి కాబట్టి టీడీపీని వ్యతిరేకిస్తున్నాడని, తద్వారా పరోక్షంగా జగన్‌మోహన్‌రెడ్డికి ఉపయోగపడుతున్నాడని విమర్శలుచెయ్యడం ప్రారంభించారు. తెలుగుదేశం నైజం తెలిసినవాళ్ళకు ఇది ఆశ్చర్యం కాదు. కులాలను విభజించి పాలించడంలో బ్రిటీష్‌వాడిని తలదన్నేమేధావి చంద్రబాబు. కాంగ్రెస్‌కు పెట్టనికోటలాగా బలమైన అండగా వున్న దళితులను […]

మేధావుల కుల అసహనం
X

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కుల అసహనం తీవ్రస్థాయికి చేరింది. సీపీయం నాయకుడు మధు, చంద్రబాబు పాలనలోని లోపాలను నిరంతరం ఎత్తిచూపడంతో వాటికి సమాధానం చెప్పలేక, వాళ్లను వాళ్ళు సరిదిద్దుకోలేక మధుమీద కులంబురదచల్లే కార్యక్రమానికి తెరతీశారు. టీడీపీ నాయకులు మధు రెడ్డి కాబట్టి టీడీపీని వ్యతిరేకిస్తున్నాడని, తద్వారా పరోక్షంగా జగన్‌మోహన్‌రెడ్డికి ఉపయోగపడుతున్నాడని విమర్శలుచెయ్యడం ప్రారంభించారు. తెలుగుదేశం నైజం తెలిసినవాళ్ళకు ఇది ఆశ్చర్యం కాదు. కులాలను విభజించి పాలించడంలో బ్రిటీష్‌వాడిని తలదన్నేమేధావి చంద్రబాబు. కాంగ్రెస్‌కు పెట్టనికోటలాగా బలమైన అండగా వున్న దళితులను రిజర్వేషన్లపేరుతో మాల, మాదిగలుగా చీల్చి వాళ్ళమధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలా చిచ్చుపెట్టి ఈనాటికీ విజయవంతంగా కథ నడిపిస్తున్న అసలుసిసలు రాజకీయనాయకుడు చంద్రబాబునాయుడు. అలాగే కమ్మసామాజికవర్గానికి బద్దశత్రువులైన కాపు, బ్రాహ్మణవర్గాలను తనవైపు తిప్పుకున్న అపరచాణిక్యుడు చంద్రబాబు. ఈ విషయంలో చంద్రబాబు తెలివికొంతైతే జగన్‌ అసమర్ధత, అహంకారం చంద్రబాబుకు ఎక్కువగా తొడ్పడ్డాయి.

అవసరం అయినప్పుడు కులం కార్డులను వాడడం చంద్రబాబుకు కొత్తకాదు. కానీ ఇటీవల కొందరు కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు మేధావులు కూడా బయటపడి కులంకార్డు వాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ, సీపీయం, లోక్‌సత్తా, తదితర పార్టీలు కమ్మసామాజికవర్గం చేతుల్లోనే వున్నాయి. తెలుగుదేశం స్థాపించాక సీపీఐ, సీపీయం పార్టీలు కులం పిచ్చితోనే బాగా దెబ్బతిన్నాయి. సీపీయం నాయకుడు రాఘవులు, మధులాంటి కొద్దిమంది కులమతాలకు అతీతంగా నిలబడ్డారు. సీపీఐ నారాయణ కులపిచ్చి లోకవిదితమే. మహామేధావి, గొప్ప నిజాయతీపరుడు, సమర్ధ అధికారిగా పేరుతెచ్చుకున్న లోక్‌సత్తా జయప్రకాష్‌నారాయణ కూడా ఈ కులపిచ్చినుంచి బయటపడలేకపోయారంటారు. కేజ్రీవాల్‌ కన్నా ముందు మనదేశంలో ఒక విశిష్ట రాజకీయనాయకుడిగా ఎదగాల్సిన జయప్రకాష్‌ ఈ కారణంగానే ఎంఎల్‌ఏగా కూడా గెలవలేని దుస్థితికి వచ్చారంటారు. ముఖ్యమంత్రికావడానికి ఏవిధమైన అర్హతలులేని జగన్‌మోహన్‌రెడ్డి కూడా కులం కార్డుతోనే నాయకుడిగా ఎదిగాడు.

రాజకీయాల్లో ఈ స్థాయిలో ముదిరిపోయిన కులపిచ్చినుంచి ఇప్పుడు కమ్యూనిస్టుమేధావులు కూడా బయటపడలేక పోతున్నారు. ఇటీవల కాలంలో పత్రికల్లోను, సోషల్‌మీడియాల్లోనూ, ఫేసుబుక్కుల్లోనూ, కమ్యూనిస్టుమేధావుల పోస్టులు చూస్తుంటే కమ్యూనిస్టుపార్టీలు ఎందుకు ఇలా తయారయ్యాయో స్పష్టంగా అర్ధం అవుతుంది. చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమంటే అవినీతిపరుడైన జగన్‌ను సమర్ధించడమేనని ఈ కమ్యూనిస్టుమేధావులు చేస్తున్న వాదనలుచూస్తుంటే రాష్ట్రంలో కుల అసహనం ఏస్థాయికి చేరిందో అర్ధమౌతోందని రాజకీయవిశ్లేషకులు అంటున్నారు.

First Published:  9 Jan 2016 1:14 AM GMT
Next Story