Telugu Global
Cinema & Entertainment

 లోఫర్ భామపై కన్నేసిన రేసుగుర్రం

వరుణ్ తేజ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది దిషా పతానీ. ఆ సినిమాలో నటనకు ఆస్కారం ఉండే పాత్రే చేసింది. కాకపోతే సినిమా ఫ్లాప్. దీంతో దిషాకు అవకాశాలు పెద్దగా రాలేదు. టాలీవుడ్ లో సెకెండ్ ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్న ఈ భామకు ఊహించని ఆఫర్ తగలింది. బన్నీ తన తాజా సినిమాలో లోఫర్ భామకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. బన్నీ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా సరే అంటారు. దిషా […]

 లోఫర్ భామపై కన్నేసిన రేసుగుర్రం
X
వరుణ్ తేజ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది దిషా పతానీ. ఆ సినిమాలో నటనకు ఆస్కారం ఉండే పాత్రే చేసింది. కాకపోతే సినిమా ఫ్లాప్. దీంతో దిషాకు అవకాశాలు పెద్దగా రాలేదు. టాలీవుడ్ లో సెకెండ్ ప్రాజెక్టు కోసం వెయిట్ చేస్తున్న ఈ భామకు ఊహించని ఆఫర్ తగలింది. బన్నీ తన తాజా సినిమాలో లోఫర్ భామకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. బన్నీ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరైనా సరే అంటారు. దిషా కూడా దాదాపు ఓకే చెప్పేసింది. కాకపోతే అది ఐటెంసాంగ్ ఆఫర్ కావడంతో… కాస్త ఆలోచనలో పడింది.

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో అంజలితో ఓ ఐటెంసాంగ్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అంజలిని తప్పించి ఆ స్థానంలో మరో బ్యూటీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగా లోఫర్ భామ దిషాను సంప్రదించారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ ఐటెంసాంగ్ ఆఫర్ ఒప్పుకుంటే… ఇకపై అన్నీ ఇలాంటి మసాలా పాటలే వస్తాయేమో అని భయపడిపోతోంది దిషా.

Next Story