Telugu Global
NEWS

రంగా హత్యపై వర్మ సంచలన వ్యాఖ్యలు

వివాదాల వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వంగవీటి రంగాపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ ఇప్పుడో ఇంటర్యూలో ఏకంగా రంగా హత్య చేసిన వారు తనకు తెలుసని చెప్పారు. హత్యలో అంతర్గతంగా ఇన్వాల్వ్ అయిన వారిలో చాలా మంది తనకు తెలుసని చెప్పారు.  అయితే సంచలనాల కోసం చాలా చెప్పే వర్మ ఆ కోవలోనే ఈ వ్యాఖ్యలు చేశారా లేక సీరియస్‌గానే అన్నారా అన్నది తేలాలి. అయితే వర్మ తీస్తానంటున్న సినిమాపైనా కొందరు అనుమానం […]

రంగా హత్యపై వర్మ సంచలన వ్యాఖ్యలు
X

వివాదాల వర్మ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో వంగవీటి రంగాపై సినిమా తీస్తానని ప్రకటించిన వర్మ ఇప్పుడో ఇంటర్యూలో ఏకంగా రంగా హత్య చేసిన వారు తనకు తెలుసని చెప్పారు. హత్యలో అంతర్గతంగా ఇన్వాల్వ్ అయిన వారిలో చాలా మంది తనకు తెలుసని చెప్పారు. అయితే సంచలనాల కోసం చాలా చెప్పే వర్మ ఆ కోవలోనే ఈ వ్యాఖ్యలు చేశారా లేక సీరియస్‌గానే అన్నారా అన్నది తేలాలి. అయితే వర్మ తీస్తానంటున్న సినిమాపైనా కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వంగవీటిరంగాను నెగిటివ్‌గా చూపించేలా వర్మ సినిమా తీయబోతున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. వర్మ వెనుక బెజవాడకు చెందిన ఒక నేత ఉన్నారని చెబుతున్నారు.

First Published:  7 Jan 2016 11:58 PM GMT
Next Story