Telugu Global
Others

రామ్‌ వర్సెస్‌ టీవీ5- ఎవరు 420?

నేను శైలజ సినిమా బాగోలేందంటూ కథనాన్ని ప్రసారం చేసిన టీవీ5పై హీరో రామ్ తొలుత నిప్పులు చెరిగారు. ప్రపంచమంతా సినిమా బాగుందని అంటుంటే ఆ చానల్‌కు మాత్రమే చిత్రం బాగోలేదంటూ ఎందుకు కథనాన్ని ప్రసారం చేసిందని ట్వీట్లర్‌లో ప్రశ్నించారు. అంతవరకు ఓకే. అయితే ఇప్పుడు వివాదం మరో మలుపు తిరిగింది. టీవీ5 యాజమాన్యం ఒక ఉద్యోగిని తొలగించింది. నేను శైలజా రివ్యూను యూ ట్యూబ్ నుంచి యాజమాన్యం అనుమతి లేకుండా తొలగించినందుకు సదరు ఉద్యోగిపై వేటు వేసింది. […]

రామ్‌ వర్సెస్‌ టీవీ5- ఎవరు 420?
X

నేను శైలజ సినిమా బాగోలేందంటూ కథనాన్ని ప్రసారం చేసిన టీవీ5పై హీరో రామ్ తొలుత నిప్పులు చెరిగారు. ప్రపంచమంతా సినిమా బాగుందని అంటుంటే ఆ చానల్‌కు మాత్రమే చిత్రం బాగోలేదంటూ ఎందుకు కథనాన్ని ప్రసారం చేసిందని ట్వీట్లర్‌లో ప్రశ్నించారు. అంతవరకు ఓకే. అయితే ఇప్పుడు వివాదం మరో మలుపు తిరిగింది. టీవీ5 యాజమాన్యం ఒక ఉద్యోగిని తొలగించింది. నేను శైలజా రివ్యూను యూ ట్యూబ్ నుంచి యాజమాన్యం అనుమతి లేకుండా తొలగించినందుకు సదరు ఉద్యోగిపై వేటు వేసింది. దీంతో రామ్ మళ్లీ సీన్‌లోకి ఎంటరయ్యాడు.

ఉద్యోగం పోగొట్టుకున్న సదరు వ్యక్తికి అండగా నిలిచాడు. కొత్త ఉద్యోగం దొరికేవరకు సదరు వ్యక్తికి తానే జీతం ఇస్తానని ప్రకటించాడు. దీనిపై టీవీ5 తీవ్రంగా స్పందించింది. 420లకు ఎలా అండగా నిలుస్తారని తన మీడియా ద్వారా రామ్‌ను ప్రశ్నించింది. యూట్యూబ్‌ నుంచి సినిమా రివ్యూను ఉద్యోగి తొలగించడం వెనుక రామ్‌ ప్రమేయం ఉందని కూడా సదరు చానల్‌ ఆరోపిస్తోంది. అన్నం పెట్టిన చేతికే సున్నం పెట్టిన వ్యక్తిని రామ్ ఎలా వెనుకేసుకొస్తారని ప్రశ్నిస్తోంది. టీవీ5కు నమ్మకద్రోహం చేసిన ఉద్యోగి భవిష్యత్తులో రామ్‌కు కూడా అలా చేయడన్న గ్యారెంటీ ఏమిటంటోంది. తిన్నింటివాసాలు లెక్కపెట్టే వ్యక్తులంటే రామ్‌కు ఇష్టమా అని ప్రశ్నిస్తోంది. అసలు తప్పు చేసిన వ్యక్తిని తాము తొలగించలేదని… అతడే నేరం ఒప్పుకుని రాజీనామా చేశాడని టీవీ5 చెబుతోంది.

First Published:  8 Jan 2016 3:16 AM GMT
Next Story