Telugu Global
Cinema & Entertainment

మెగాఫోన్ వ‌దిలేసాడా..!

డైరెక్ట‌ర్ ఎన్ శంక‌ర్  గురించి ఇప్ప‌టి ఆడియ‌న్స్ కు పెద్ద‌గా తెలియెక పోవ‌చ్చు. ఎన్ కౌంట‌ర్ చిత్రంతో   ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి..  మొన్న‌టి  తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన  జై బోలో తెలంగాణ చి్త్రం వ‌ర‌కు  ఎన్నో సామాజిక సృహ ఉన్న చిత్రాలు చేశాడు.  రాజ‌శేఖ‌ర్ తో ఆయుధం..  విక్ట‌రీ వెంక‌టేష్ తో   జ‌యం మ‌న‌దేరా చిత్రాలు శంక‌ర్ కు  ద‌ర్శ‌కుడిగా త‌ను చూసిన స‌మాజం  ..త‌ను స‌మాజాన్ని అర్దం చేసుకున్న తీరు  ఈ రెండు చిత్రాల్లో […]

మెగాఫోన్ వ‌దిలేసాడా..!
X

డైరెక్ట‌ర్ ఎన్ శంక‌ర్ గురించి ఇప్ప‌టి ఆడియ‌న్స్ కు పెద్ద‌గా తెలియెక పోవ‌చ్చు. ఎన్ కౌంట‌ర్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి.. మొన్న‌టి తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో చేసిన జై బోలో తెలంగాణ చి్త్రం వ‌ర‌కు ఎన్నో సామాజిక సృహ ఉన్న చిత్రాలు చేశాడు. రాజ‌శేఖ‌ర్ తో ఆయుధం.. విక్ట‌రీ వెంక‌టేష్ తో జ‌యం మ‌న‌దేరా చిత్రాలు శంక‌ర్ కు ద‌ర్శ‌కుడిగా త‌ను చూసిన స‌మాజం ..త‌ను స‌మాజాన్ని అర్దం చేసుకున్న తీరు ఈ రెండు చిత్రాల్లో బాగా ప్రొజెక్ట్ చేయ‌గ‌లిగార‌నిపిస్తుంది. వినోదం వుంటూనే సామాజిక అంశాల్ని చూపించ‌డంలో ఎన్ శంక‌ర్ సిద్ద హ‌స్తుడు. అయితే ఈ మ‌ధ్య డైరెక్ట‌ర్ గా శంక‌ర్ చిత్రాలు ఏవి ఎనౌన్స్ చేయ‌లేదు.

ఇప్ప‌టి యూత్ ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకునేలా చిత్రాలు చేయాలంటే క‌త్తి మీద సామే. ఆయ‌న‌కు చిత్రాలు చేయ‌డం కొత్త కాదు కానీ.. ఇప్ప‌టి ఆడియ‌న్స్ టేస్ట్ ను ప‌ట్టుకోవ‌డం ఒకింత చాలెంజ్ అని చెప్పాలి. అందుకే శంక‌ర్ ఇక యాక్టింగ్ పై దృష్టి సారించిన‌ట్లున్నాడు.ఉయ్యాల జంపాల మూవీతో కెరీర్ మొదలు పెట్టి సక్సెస్ ఫుల్ గా దూసుకెలుతున్న యువ నటుడు రాజ్ తరుణ్…. ప్రస్తుతం ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో రాజ్ తరుణ్ తండ్రి పాత్రలో దర్శకుడు ఎన్.శంకర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య చిత్రీకరించిన తండ్రీ కొడుకుల సీన్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు. ఇప్పటి వరకు తెర వెనక దర్శకుడిగా ఉన్న ఎన్.శంకర్… నటుడిగా తెరపై కనిపించడం ఇదే తొలిసారి. ఈ సినిమాకు సంబందించిన ఆడియోని ఈ నెల 10న విడుదలచేయాలని, సినిమాను జనవరి 29న విడుదల చేయాడానికి సిద్దం అవుతున్నారు. ఈ సినిమా ద్వారా ఆర్తన అనే కొత్త హీరోయిన్ పరిచయం అవుతోంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు డైరెక్ట‌ర్ గా మెప్పించిన శంక‌ర్.. ఇక న‌టుడిగా త‌న జ‌ర్నీ ఎలా సాగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Next Story