Telugu Global
Cinema & Entertainment

శ‌ర్వా నంద్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా ?

యంగ్ హీరోస్ లో ఎవ‌రి మార్క్ వాళ్ల‌కుంది.  అల్ల‌రి న‌రేష్ అంటే  కామెడి చిత్రాల‌నీ..  హీరో నానీ అంటే  అష్టా చెమ్మ‌లాంటి చిత్రాలు..  అలాగే  శ‌ర్వానంద్ అంటే  ఏదో స‌బ్జెక్ట్ వున్న చిత్రాలు చేస్తాడ‌నే న‌మ్మకం ఉంది. అయితే శ‌ర్వానంద్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌థా బ‌లం వున్న సిరియ‌స్ స‌బ్జెక్ట్  లు చేశాడు.  ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో త‌న‌లో కామెడి యాంగిల్ ను చూపే ప్ర‌య‌త్నం చేశాడు.అది కొంత వ‌ర‌కు స‌క్సెస్ కావ‌డంతో…   లేటెస్ట్ గా […]

శ‌ర్వా నంద్ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా ?
X

యంగ్ హీరోస్ లో ఎవ‌రి మార్క్ వాళ్ల‌కుంది. అల్ల‌రి న‌రేష్ అంటే కామెడి చిత్రాల‌నీ.. హీరో నానీ అంటే అష్టా చెమ్మ‌లాంటి చిత్రాలు.. అలాగే శ‌ర్వానంద్ అంటే ఏదో స‌బ్జెక్ట్ వున్న చిత్రాలు చేస్తాడ‌నే న‌మ్మకం ఉంది. అయితే శ‌ర్వానంద్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌థా బ‌లం వున్న సిరియ‌స్ స‌బ్జెక్ట్ లు చేశాడు. ర‌న్ రాజా ర‌న్ చిత్రంతో త‌న‌లో కామెడి యాంగిల్ ను చూపే ప్ర‌య‌త్నం చేశాడు.అది కొంత వ‌ర‌కు స‌క్సెస్ కావ‌డంతో… లేటెస్ట్ గా మేర్ల‌పాక గాంధి ద‌ర్శ‌క‌త్వంలో ఎక్స్ ప్రెస్ రాజా అనే చిత్రంచేశాడు. ఈసినిమా ప్ర‌చార చిత్రాలు చూస్తుంటే.. శ‌ర్వానంద్ అవుట్ అండ్ కామెడి చేస్తున్నాడ‌ని స్ప‌ష్టం అవుతుంది. ఈ చిత్రంలో బీరువా సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన సుర‌భీ మెయిన్ హీరోయిన్ రోల్ చేస్తుంది. ఆ చిత్రంలో సందీప్ కిష‌న్ స‌ర‌స‌న ట్రెడిష‌న‌ల్ అమ్మాయిగా క‌నిపించిన ఈ ముద్దుగుమ్మ‌.. ఈ చిత్రంలో మాత్రం గ్లామ‌ర్ డాల్ గా క‌నిపిస్తుంది.

మ‌రి శ‌ర్వానంద్ కామెడి ఏ మేర‌కు అభిమానుల్ని మెప్పిస్తుందో తెలియాలంటే సంక్రాంతిపండ‌గ వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. శ‌ర్వా తొలిసారి పండ‌గ బ‌రిలో వ‌స్తున్నాడు మ‌రి.

Next Story