Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ కు సెన్సార్ టెన్షన్లు

నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి మరో న్యూస్. ఈ మూవీ సంక్రాంతికి వస్తుందా రాదా అనే టెన్షన్ ఉండేది మొన్నటివరకు. కానీ మేకర్స్ పదేపదే ప్రకటనలు చేసి…. రిలీజ్ డేట్ పై ఉన్న ఆనుమానాల్ని దాదాపు 80శాతం వరకు తగ్గించగలిగారు. తాజాగా ఇప్పుడు సెన్సార్ టెన్షన్లు మొదలయ్యాయి. ఈనెల 13న నాన్నకు ప్రేమతో సినిమాను విడుదల చేయాలంటే… అటు ఇటుగా ఈపాటికి సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వాలి. కానీ నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎడిటింగ్ […]

ఎన్టీఆర్ కు సెన్సార్ టెన్షన్లు
X
నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి మరో న్యూస్. ఈ మూవీ సంక్రాంతికి వస్తుందా రాదా అనే టెన్షన్ ఉండేది మొన్నటివరకు. కానీ మేకర్స్ పదేపదే ప్రకటనలు చేసి…. రిలీజ్ డేట్ పై ఉన్న ఆనుమానాల్ని దాదాపు 80శాతం వరకు తగ్గించగలిగారు. తాజాగా ఇప్పుడు సెన్సార్ టెన్షన్లు మొదలయ్యాయి. ఈనెల 13న నాన్నకు ప్రేమతో సినిమాను విడుదల చేయాలంటే… అటు ఇటుగా ఈపాటికి సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వాలి. కానీ నాన్నకు ప్రేమతో సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎడిటింగ్ వర్కే ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పటివరకు కేవలం ఫస్టాఫ్ మాత్రమే కంప్లీట్ గా సిద్ధమైంది. కీలకమైన సెకాండాఫ్ పని ఇంకా నడుస్తూనే ఉంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సెన్సార్ కు వెళ్లాలి. మరోవైపు రిలీజ్ డేట్ తరుముకొస్తోంది. సెన్సార్ వాళ్లు ఏమైనా అభ్యంతరాలు చెబితే… వాటిని సరిదిద్దుకోవడానికి కూడా టైమ్ కావాలి. అందుకే టోటల్ టీం అంతా ఇప్పుడు ఎడిట్ రూం వైపు చూస్తోంది. తొందరగా సెకెండాఫ్ ఎడిటింగ్ కంప్లీట్ అయితే సెన్సార్ కు తీసుకెళ్దామని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు సెన్సార్ ఆఫీస్ లో స్లాట్లు బుక్ చేసి, క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ టెన్షన్ ను కూడా దాటితే… నాన్నకు ప్రేమతో సినిమా సంక్రాంతి బరిలో నిలిచినట్టే.
First Published:  6 Jan 2016 3:13 PM GMT
Next Story