Telugu Global
Cinema & Entertainment

ఈ పిల్ల పని అయిపోయినట్టే..!

క్రేజ్ బాగా ఉంటే తెలుగులో ఓ వెలుగు వెలిగిపోవచ్చు. అదే క్రేజ్ ను కాస్త పక్కకు టర్న్ చేస్తే… తమిళనాట కూడా చక్రం తిప్పొచ్చు. ఆ తర్వాత క్రేజ్ తగ్గితే మాత్రం ఎవరైనా కన్నడ-టర్న్ తీసుకోవాల్సిందే. ఇప్పటివరకు హీరోయిన్ల విషయంలో జరుగుతున్న కెరీర్ క్రమం ఇదే. క్రేజ్ తగ్గిన ప్రతి అందగత్తె… కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోతుంది. ఇక అట్నుంచి అటు ఇంటికే. గతంలో ఎంతోమంది భామలు… ఈ విషయాన్ని రుజువుచేశారు. ఇప్పుడు ఇదే దారిలో కాజల్ […]

ఈ పిల్ల పని అయిపోయినట్టే..!
X
క్రేజ్ బాగా ఉంటే తెలుగులో ఓ వెలుగు వెలిగిపోవచ్చు. అదే క్రేజ్ ను కాస్త పక్కకు టర్న్ చేస్తే… తమిళనాట కూడా చక్రం తిప్పొచ్చు. ఆ తర్వాత క్రేజ్ తగ్గితే మాత్రం ఎవరైనా కన్నడ-టర్న్ తీసుకోవాల్సిందే. ఇప్పటివరకు హీరోయిన్ల విషయంలో జరుగుతున్న కెరీర్ క్రమం ఇదే. క్రేజ్ తగ్గిన ప్రతి అందగత్తె… కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోతుంది. ఇక అట్నుంచి అటు ఇంటికే. గతంలో ఎంతోమంది భామలు… ఈ విషయాన్ని రుజువుచేశారు. ఇప్పుడు ఇదే దారిలో కాజల్ అగర్వాల్ కూడా ఉంది.
తెలుగు-తమిళ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన కలువకళ్ల కాజల్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయనేది అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆ విషయాన్ని కాజల్ మాత్రం ఒప్పుకోలేదు. అయితే తాజాగా ఇప్పుడామె కన్నడలో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. దీంతో అంతా కాజల్ కెరీర్ పై ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఎందుకంటే… తెలుగు-తమిళ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్న ఏ హీరోయిన్, కన్నడలో నటించడానికి అంగీకరించదు. కానీ కాజల్ కన్నడ సినిమా ఒప్పుకుందంటే… ఇక ఆమె కెరీర్ లో చరమాంకానికి చేరుకున్నట్టేనని చాలామంది అంచనా వేస్తున్నారు. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన ఓ సినిమాలో నటించడానికి కాల్షీట్లు కేటాయించింది కాజల్ అగర్వాల్.
First Published:  6 Jan 2016 3:14 PM GMT
Next Story