Telugu Global
NEWS

హైకోర్టులో టీ ప్రభుత్వానికి చుక్కెదురు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జనవరి 31లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన హైకోర్టు ఆ గడువును కూడా కొద్దిమేర పెంచింది. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత  31 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు ఇచ్చింది. 31 రోజుల్లో సెలవులకు మినహాయింపులు ఇచ్చారు. శనివారంలోగా రిజర్వేషన్లు ప్రకటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కుదించే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా […]

హైకోర్టులో టీ ప్రభుత్వానికి చుక్కెదురు
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జనవరి 31లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో ఆదేశించిన హైకోర్టు ఆ గడువును కూడా కొద్దిమేర పెంచింది. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత 31 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువు ఇచ్చింది. 31 రోజుల్లో సెలవులకు మినహాయింపులు ఇచ్చారు. శనివారంలోగా రిజర్వేషన్లు ప్రకటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కుదించే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న అంశాన్ని తర్వాత తేలుస్తామని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్, కాంగ్రెస్ నేత మర్రిశశిధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయమన్నారు. ఇతర పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం లేకుండా చేసేందుకే ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ను కుదించిందని శశిధర్ రెడ్డి విమర్శించారు.

First Published:  7 Jan 2016 5:29 AM GMT
Next Story