Telugu Global
Cinema & Entertainment

హ్యాండిచ్చాడా ?

టాలీవుడ్ లో బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్. అప్పటివరకు వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్య కెరీర్ కు ఓ ఊపుతెచ్చాడు బోయపాటి శ్రీను. సింహా సినిమాతో నటసింహానికి అదిరిపోయే హిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా బాలయ్యకు వరుస ఫ్లాపులు వస్తున్న టైమ్ లో…. లెజెండ్ తో మరోసారి కెరీర్ ను నిలబెట్టాడు. తనకు రెండు అల్టిమేట్స్ ఇచ్చిన బోయపాటితో బాలయ్య వందో సినిమా చేస్తాడని అంతా సహజంగానే ఊహిస్తారు. కానీ బాలయ్య మాత్రం […]

హ్యాండిచ్చాడా ?
X
టాలీవుడ్ లో బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎవర్ గ్రీన్. అప్పటివరకు వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్య కెరీర్ కు ఓ ఊపుతెచ్చాడు బోయపాటి శ్రీను. సింహా సినిమాతో నటసింహానికి అదిరిపోయే హిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా బాలయ్యకు వరుస ఫ్లాపులు వస్తున్న టైమ్ లో…. లెజెండ్ తో మరోసారి కెరీర్ ను నిలబెట్టాడు. తనకు రెండు అల్టిమేట్స్ ఇచ్చిన బోయపాటితో బాలయ్య వందో సినిమా చేస్తాడని అంతా సహజంగానే ఊహిస్తారు. కానీ బాలయ్య మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నాడట.
తన కెరీర్ లో విలక్షణ సినిమాగా నిలిచిన ఆదిత్య-369కు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడట బాలయ్య. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో బాలయ్య చర్చలు కూడా జరిపారని సమాచారం. నటసింహం గ్రీన్ సిగ్నల్ తో సింగీతం… ఇప్పుడు స్క్రీన్ ప్లే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్ సినిమాకు ఆదిత్య-999 అనే పేరు కూడా పెట్టారని అంటున్నారు. ఈ స్థాయిలో బాలయ్య వందో సినిమాపై రూమర్లు రావడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం బన్నీతో సరైనోడు అనే సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను…. ఈ మూవీ తర్వాత బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఏప్రిల్ నుంచి ఇది ప్రారంభమౌతుందని కూడా ప్రకటించాడు. దీంతో బాలయ్య వందో సినిమా, సింగీతంతోనే ఉంటుందని చాలామంది లెక్కకడుతున్నారు.
First Published:  6 Jan 2016 3:11 PM GMT
Next Story