Telugu Global
Others

బాలయ్య వారసుడు వస్తున్నాడు ?

నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై చిత్రసీమలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా మరోవార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంతో ఆదిత్య 369 సీక్వల్‌ తీసే పనిలో బాలకృష్ణ ఉన్నారు. ఆదిత్య 999 పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందని చెబుతున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మోక్షజ్ఞ చేత ఒక పాత్ర చేయించాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ విషయాన్ని బాలయ్యకు కూడా చెప్పారట. సినిమాలో […]

బాలయ్య వారసుడు వస్తున్నాడు ?
X

నందమూరి నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై చిత్రసీమలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా మరోవార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంతో ఆదిత్య 369 సీక్వల్‌ తీసే పనిలో బాలకృష్ణ ఉన్నారు. ఆదిత్య 999 పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందని చెబుతున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో మోక్షజ్ఞ చేత ఒక పాత్ర చేయించాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ విషయాన్ని బాలయ్యకు కూడా చెప్పారట. సినిమాలో యువరాజు పాత్ర ఉందని ఆ పాత్రను మోక్షజ్ఞ చేత చేయిస్తే బాగుంటుందని సింగీతం ప్రతిపాదించారని చెబుతున్నారు. యువరాజు పాత్ర కావడంతో యోక్షజ్ఞకు బాగానే ఉంటుందని కుటుంబసభ్యులు కూడా ఆలోచన చేస్తున్నారట. కొద్ది రోజుల్లోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

First Published:  7 Jan 2016 12:54 AM GMT
Next Story