Telugu Global
Cinema & Entertainment

ర‌కుల్ ఇలా కూడా చెబుతుందా..!

ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్, ప్రస్తుతం ఎన్టీఆర్ కు జోడీగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో తన […]

ర‌కుల్ ఇలా కూడా చెబుతుందా..!
X

ప్రస్తుతం యంగ్ హీరోలకు పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. రాశీఖన్నా, రెజీనా లాంటి హీరోయిన్స్ నుంచి గట్టి పోటీ ఉన్నా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయటంలో ముందే ఉంది ఈ బ్యూటీ. ఇప్పటికే రామ్ చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్, ప్రస్తుతం ఎన్టీఆర్ కు జోడీగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది.

తను డబ్బింగ్ చెపుతుండగా తీసిన ఓ మేకింగ్ వీడియోను తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. అంతేకాదు తొలిసారిగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాని, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. మరో అడుగు ముందుకేసి ఈ తొలి ప్రయత్నంలో ఏమైన తప్పులు జరిగినా.. క్షమించండీ అంటూ అందరి మనసు గెలుచుకుంది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరైనోడు సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ చిత్రం స‌క్సెస్ కొడితే .. ర‌కుల్ వెయిట్ ఒక రేంజ్ లో పెరిగిన‌ట్లే మ‌రి.

First Published:  5 Jan 2016 7:02 PM GMT
Next Story