Telugu Global
Others

దాసరితో జగన్ మంతనాలు- ప్రతిపాదన ఇదే !

దర్శకుడు దాసరి నారాయణరావుతో జగన్‌ భేటీ ఆసక్తి లేపుతోంది. దాసరి ఇంటికి జగనే స్వయంగా వెళ్లారు. ఇద్దరూ చాలాసేపు రహస్యంగా మంతనాలు జరిపారు. దాసరిని జగన్‌ వైసీపీలోకి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితమే ప్రతిపాదన పంపగా దాసరి అంగీకరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ దాసరి ఇంటికి వెళ్లారు. కాపు సామాజికవర్గానికి చెందిన దాసరి పార్టీలోకి వస్తే కొన్ని జిల్లాల్లో పార్టీకి పట్టు మరింత పెరుగుతుందని జగన్‌ భావిస్తున్నారు. మీలాంటి పెద్దవారు పార్టీలోకి వస్తే బాగుంటుందని […]

దాసరితో జగన్ మంతనాలు- ప్రతిపాదన ఇదే !
X

దర్శకుడు దాసరి నారాయణరావుతో జగన్‌ భేటీ ఆసక్తి లేపుతోంది. దాసరి ఇంటికి జగనే స్వయంగా వెళ్లారు. ఇద్దరూ చాలాసేపు రహస్యంగా మంతనాలు జరిపారు. దాసరిని జగన్‌ వైసీపీలోకి ఆహ్వానించినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితమే ప్రతిపాదన పంపగా దాసరి అంగీకరించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ దాసరి ఇంటికి వెళ్లారు. కాపు సామాజికవర్గానికి చెందిన దాసరి పార్టీలోకి వస్తే కొన్ని జిల్లాల్లో పార్టీకి పట్టు మరింత పెరుగుతుందని జగన్‌ భావిస్తున్నారు. మీలాంటి పెద్దవారు పార్టీలోకి వస్తే బాగుంటుందని జగన్‌ కోరారని చెబుతున్నారు. దాసరి పార్టీలో ఎప్పుడు చేరుతారన్న దానిపై స్పష్టత లేకపోయినా ఎదో ఒక రోజు అది జరగడం ఖాయమంటున్నారు. జగన్‌తో భేటీపై దాసరి స్పందించారు. వైఎస్‌తో ఉన్న సాన్నిహిత్యంతోనే భేటీ అయ్యారని చెప్పారు. జగన్‌ రాజకీయంగా గట్టిగా పోరాడుతున్నారని ప్రశంసించారు. జగన్‌కు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించినట్టు దాసరి చెప్పారు.

Click to Read: జగన్, దాసరి భేటీ (video)

Click to Read: దాసరితో జగన్‌ భేటీ…

jagan dasari2

jagan dasari3jagan-dasari-meet2 jagan-dasari-meeting

First Published:  5 Jan 2016 7:31 AM GMT
Next Story