Telugu Global
NEWS

దాసరితో జగన్‌ భేటీ...

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత జగన్‌, దర్శకుడు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణను కలిశారు. స్వయంగా దాసరి ఇంటికి జగన్‌ వెళ్లి కలిశారు. దాసరి ఎదురొచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. శాలువ కప్పి ఆహ్వానించారు. ఇద్దరు నేతలు కలిసి ఇంటిలోని పై అంతస్తుకు వెళ్లి చర్చలు జరిపారు. దాసరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్‌ వెళ్లినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితమే పార్టీలోకి చేరాల్సిందిగా దాసరికి జగన్ ప్రతిపాదన పంపినట్టు చెబుతున్నారు. దాసరి […]

దాసరితో జగన్‌ భేటీ...
X

ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ అధినేత జగన్‌, దర్శకుడు మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణను కలిశారు. స్వయంగా దాసరి ఇంటికి జగన్‌ వెళ్లి కలిశారు. దాసరి ఎదురొచ్చి జగన్‌కు స్వాగతం పలికారు. శాలువ కప్పి ఆహ్వానించారు. ఇద్దరు నేతలు కలిసి ఇంటిలోని పై అంతస్తుకు వెళ్లి చర్చలు జరిపారు. దాసరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు జగన్‌ వెళ్లినట్టు చెబుతున్నారు. మూడు నెలల క్రితమే పార్టీలోకి చేరాల్సిందిగా దాసరికి జగన్ ప్రతిపాదన పంపినట్టు చెబుతున్నారు. దాసరి నుంచి కూడా సానుకూల స్పందన రావడంతోనే జగన్ నేరుగా కలిశారని చెబుతున్నారు.

Click to Read: దాసరితో జగన్ మంతనాలు- ప్రతిపాదన ఇదే !

jagan dasari2

jagan dasari3

jagan-dasari-meeting jagan-dasari-meet2

First Published:  5 Jan 2016 7:22 AM GMT
Next Story