Telugu Global
Cinema & Entertainment

రైజింగ్ స్టార్స్ ఆఫ్ 2015

స్టార్ హీరోలు లేదా చిన్న హీరోలు అన్నట్టుగా మారిన టైమ్‌లో ఈ ఏడాది ఇద్దరు హీరోలు తమ సత్తా చాటుకుని నమ్మకం పెట్టుకోతగ్గ వాళ్లనిపించుకున్నారు. ఉయ్యాల జంపాలతో విజయాన్ని అందుకున్న రాజ్ తరుణ్ ఈ ఇయర్ వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకున్నాడు. సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ చిత్రాల్లో ఒక దానితో మరొకదానికి సంబంధం లేని పాత్రలు పోషించి మెప్పించి ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అనిపించాడు. నాగబాబు తనయుడు వరుణ్ […]

రైజింగ్ స్టార్స్ ఆఫ్ 2015
X
స్టార్ హీరోలు లేదా చిన్న హీరోలు అన్నట్టుగా మారిన టైమ్‌లో ఈ ఏడాది ఇద్దరు హీరోలు తమ సత్తా చాటుకుని నమ్మకం పెట్టుకోతగ్గ వాళ్లనిపించుకున్నారు. ఉయ్యాల జంపాలతో విజయాన్ని అందుకున్న రాజ్ తరుణ్ ఈ ఇయర్ వరుసగా రెండు సూపర్ హిట్ సినిమాలతో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకున్నాడు. సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ చిత్రాల్లో ఒక దానితో మరొకదానికి సంబంధం లేని పాత్రలు పోషించి మెప్పించి ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ అనిపించాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌కి విజయాలు వరించడం లేదు కానీ కంచె, లోఫర్ చిత్రాలతో తన ప్రతిభ చాటుకున్నాడు. ఎక్స్‌పెరిమెంట్స్‌కి సిద్ధమని, ఎలాంటి కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలనని నిరూపించుకున్నాడు. గత ఏడాది తెరమీదకొచ్చిన సాయి ధరమ్ తేజ్ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో తిరుగులేని కాన్ఫిడెన్స్ చూపించి మిడ్ రేంజ్ హీరోల్లో నమ్మకం పెట్టుకోతగిన హీరోగా ఎదిగాడు.
First Published:  3 Jan 2016 7:06 PM GMT
Next Story