Telugu Global
Cinema & Entertainment

ఒకేసారి 2 భాషల్లో దేవిశ్రీ ఎంట్రీ

సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ హీరోగా మారబోతున్నాడనేది పాత విషయమే. అయితే తొలి ప్రయత్నంలోనే ఒకేసారి రెండు భాషల్లో హీరోగా మెరవాలనుకుంటున్నాడు ఈ సంగీత దర్శకుడు. అవును… సుకుమార్ దర్శకత్వంలో ముఖానికి రంగేసుకోనున్న ఈ మ్యూజిక్ మెషీన్….. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా కనిపించనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే దిల్ రాజు, సుకుమార్, దేవిశ్రీ మధ్య ఓ అవగాహన కుదిరింది. సినిమా కంప్లీట్ అయిన వెంటనే… తెలుగు, తమిళ భాషల్లోని దిగ్గజాలతో ప్రమోషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దేవిశ్రీకి […]

ఒకేసారి 2 భాషల్లో దేవిశ్రీ ఎంట్రీ
X
సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ హీరోగా మారబోతున్నాడనేది పాత విషయమే. అయితే తొలి ప్రయత్నంలోనే ఒకేసారి రెండు భాషల్లో హీరోగా మెరవాలనుకుంటున్నాడు ఈ సంగీత దర్శకుడు. అవును… సుకుమార్ దర్శకత్వంలో ముఖానికి రంగేసుకోనున్న ఈ మ్యూజిక్ మెషీన్….. తెలుగు, తమిళ భాషల్లో హీరోగా కనిపించనున్నాడు. ఈ మేరకు ఇప్పటికే దిల్ రాజు, సుకుమార్, దేవిశ్రీ మధ్య ఓ అవగాహన కుదిరింది. సినిమా కంప్లీట్ అయిన వెంటనే… తెలుగు, తమిళ భాషల్లోని దిగ్గజాలతో ప్రమోషన్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు.
దేవిశ్రీకి తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. రిక్వెస్ట్ చేస్తే… దేవిశ్రీ సినిమా ప్రచారానికి స్వయంగా పవన్ కల్యాణ్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వెంకీ, నాగార్జున, అల్లు అర్జున్ లాంటి హీరోలైతే దేవిశ్రీకి ప్రమోషన్ ఇవ్వడానికి క్యూ కడతారు. సేమ్ సిట్యుయేషన్ తమిళనాట కూడా ఉంది. దేవిశ్రీ కోరితే… ఏకంగా సూర్య కూడా రంగంలోకి దిగుతాడు. అంతేకాదు.. ధనుష్, ఆర్య, శింబు లాంటి ఎంతోమంది నటులు దేవిశ్రీ కోసం ప్రచారం చేయడానికి రెడీ. అందుకే…తనకున్న పరిచయాల్ని ఉపయోగించుకొని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని దేవిశ్రీ ఫిక్స్ అయ్యాడు.
First Published:  3 Jan 2016 7:04 PM GMT
Next Story