Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవం పాటను కాపీ కొట్టేశారా ?

నూతన సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ టీజర్ ను బ్రహ్మాండంగా విడుదలచేశారు. మహేష్ పర్ ఫార్మెన్స్ తో… మిక్కీజే మేయర్ స్వరపరిచిన పాటను ఫస్ట్ లుక్ టీజర్ గా వదిలారు. టీజర్ అంతంతమాత్రంగానే ఉందనే నెగెటివ్ కామెంట్స్ కు తోడు… ఇప్పుడు మరో వివాదం బ్రహ్మోత్సవానికి చుట్టుకుంది. టీజర్ లో వినిపించిన పాటను మిక్కీ జేయర్ కాపీ కొట్టేశాడంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం హోరెత్తిపోతోంది. ఇంగ్లిష్ లో సూపర్ హిట్టయిన వేక్ మి అప్ […]

బ్రహ్మోత్సవం పాటను కాపీ కొట్టేశారా ?
X
నూతన సంవత్సరం సందర్భంగా బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ టీజర్ ను బ్రహ్మాండంగా విడుదలచేశారు. మహేష్ పర్ ఫార్మెన్స్ తో… మిక్కీజే మేయర్ స్వరపరిచిన పాటను ఫస్ట్ లుక్ టీజర్ గా వదిలారు. టీజర్ అంతంతమాత్రంగానే ఉందనే నెగెటివ్ కామెంట్స్ కు తోడు… ఇప్పుడు మరో వివాదం బ్రహ్మోత్సవానికి చుట్టుకుంది. టీజర్ లో వినిపించిన పాటను మిక్కీ జేయర్ కాపీ కొట్టేశాడంటూ సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం హోరెత్తిపోతోంది. ఇంగ్లిష్ లో సూపర్ హిట్టయిన వేక్ మి అప్ అనే పాటను పోలి ఉందంటూ కంపేరిజన్స్ మొదలయ్యాయి.
వివాదం ప్రారంభమైన వెంటనే మిక్కీ జే మేయర్ మేల్కొన్నాడు. తనకు పాటలు కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ఫేస్ బుక్ లో ప్రకటించిన మిక్కీ…. కాపీ కొట్టానని చెబుతున్న పాటకు, తన పాటకు మధ్య కార్డ్ ప్రొగ్రెషన్ ఒకేలా ఉందని ఒప్పుకున్నాడు. అయితే సంగీతం, సాహిత్యం, బాణీల పరంగా రెండు పాటల మధ్య వ్యత్యాసం కొండంత ఉందన్నాడు. అసలు తను ఎలాంటి వాడినో తన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యుల్ని అడిగితే తెలుస్తుందంటున్నాడు మిక్కీ.
First Published:  2 Jan 2016 7:04 PM GMT
Next Story