Telugu Global
Cinema & Entertainment

కొత్త ఏడాదిలో టీజర్ల సందడి

న్యూ ఇయర్ లో టాలీవుడ్ కూడా బాగానే బిజీ అయిపోయింది. వరుసగా తమ కొత్త సినిమాల పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేస్తూ మేకర్స్ అంతా ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. ఇప్పటికే హల్ చల్ చేస్తున్న బ్రహ్మోత్సవం టీజర్ తో పాటు మరిన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదలై…. టాలీవుడ్ ను కొత్త ఏడాది తొలిరోజు కళకళలాడేలా చేశాయి.  నారా రోహిత్-నందిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సావిత్రి అనే చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ […]

కొత్త ఏడాదిలో టీజర్ల సందడి
X
న్యూ ఇయర్ లో టాలీవుడ్ కూడా బాగానే బిజీ అయిపోయింది. వరుసగా తమ కొత్త సినిమాల పోస్టర్లు, టీజర్లు రిలీజ్ చేస్తూ మేకర్స్ అంతా ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. ఇప్పటికే హల్ చల్ చేస్తున్న బ్రహ్మోత్సవం టీజర్ తో పాటు మరిన్ని ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదలై…. టాలీవుడ్ ను కొత్త ఏడాది తొలిరోజు కళకళలాడేలా చేశాయి.
నారా రోహిత్-నందిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సావిత్రి అనే చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ విషయాన్ని స్వయంగా నందిత కన్ ఫర్మ్ చేసింది. న్యూ ఇయర్ కాబట్టి… సావిత్రి ఫొటో పెడుతున్నానని… కానీ అఫీషియల్ ఫస్ట్ లుక్ మాత్రం మరో రోజు ఉంటుందని తెలిపింది. అటు సాయిధర్మతేజ హీరోగా నటిస్తున్న సుప్రీమ్ సినిమాకు సంబంధించి కూడా ఫస్ట్ లుక్ ఫొటోలు, టీజర్లు విడుదల చేశారు. వీటితో పాటు… మంచు మనోజ్ శౌర్య, సునీల్ కృష్ణాష్టమి ఫొటోలు కూడా విడుదలయ్యాయి. అటు రచయిత గోపీమోహన్ దర్శకుడిగా మారి తీయనున్న ఇష్టంగా… సంతోషంగా… ఆనందంగా అనే సినిమా టైటిల్ ను కూడా విడుదల చేశారు.
First Published:  1 Jan 2016 7:03 PM GMT
Next Story