Telugu Global
Cinema & Entertainment

మహేష్ ఫ్యాన్స్ కు వచ్చింది కదా అవకాశం...

న్యూ ఇయర్ సందర్భంగా సైలెంట్ గా తన కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు మహేష్ బాబు. అసలు కొత్త ఏడాదిలో ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేద్దామా… కేవలం టైటిల్ విడుదల చేసి చేతులు దులుపుకుందామా అనే సందిగ్దంలోనే చాలా టైం వేస్టు చేశారు మేకర్స్. అయితే ఏదో ఒకటి రాకతప్పదని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. మొత్తానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ తో బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. టీజర్ లో […]

మహేష్ ఫ్యాన్స్ కు వచ్చింది కదా అవకాశం...
X

న్యూ ఇయర్ సందర్భంగా సైలెంట్ గా తన కొత్త సినిమా టీజర్ విడుదల చేశాడు మహేష్ బాబు. అసలు కొత్త ఏడాదిలో ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేద్దామా… కేవలం టైటిల్ విడుదల చేసి చేతులు దులుపుకుందామా అనే సందిగ్దంలోనే చాలా టైం వేస్టు చేశారు మేకర్స్. అయితే ఏదో ఒకటి రాకతప్పదని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు. మొత్తానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ తో బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేశారు. టీజర్ లో భాగంగా… మహేష్ తో సోలో సాంగ్ విడుదలైంది. వచ్చింది కదా అవకాశం… ఓ మంచి మాట అనుకుందాం… అంటూ సాగే పాటను టీజర్ గా విడుదల చేశారు. పనిలోపనిగా టైటిల్ ను కూడా పొందుపరిచారు. మొదట్నుంచి చెబుతున్నట్టు…. ఇది పక్కా కుటుంబకథాచిత్రం అనే విషయం టీజర్ తో కన్ ఫర్మ్ అయింది. ఇక మహేష్ మేకోవర్ లో ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ… ఎప్పట్లానే ప్రిన్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు. కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ లో బ్రహ్మోత్సవం విడుదలకానుంది.

First Published:  1 Jan 2016 1:01 PM GMT
Next Story