Telugu Global
NEWS

రోజా సస్పెన్షన్ పై కమిటీ ఏం తేలుస్తుంది?

అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని దాదాపు వైసీపీ కూడా మర్చిపోయింది. అయినా టీడీపీ మాత్రం ఇప్పటికీ దాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ నలుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.  డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని సభ్యులుగా నియమించారు. […]

రోజా సస్పెన్షన్ పై కమిటీ ఏం తేలుస్తుంది?
X
అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు వైసీపీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని దాదాపు వైసీపీ కూడా మర్చిపోయింది. అయినా టీడీపీ మాత్రం ఇప్పటికీ దాన్ని సీరియస్ గానే పరిగణిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ నలుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని సభ్యులుగా నియమించారు. రోజాపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడంపై విమర్శలు రాడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏడాదిపాటు సస్పెన్షన్ సరైనదేనా? ఆమెకు వేసిన శిక్ష తక్కువా? లేక ఎక్కువా? ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్నదానిపై 20 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని స్పీకర్ ఆదేశించారు.
కమిటీ నియామకంతో అసెంబ్లీలో జరిగిన పరిణామాలతోపాటు రోజా సస్పెన్షన్ కు దారి తీసిన పరిణామాలపై ఈ సభ్యుల బృందం ఈనెల 4న గాని, 6న కాని తొలివిడత సమావేశం అవుతోంది. అధికారపక్షం విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లో కేవలం రోజాతో పాటు వైసీపీ నేతల తిట్లనే చూపించారు, టీడీపీ వాళ్లు అన్న మాటలను కూడా చూపించాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ ను ఈకమిటీ పరిగిణలోకి తీసుకోనుంది. ఈనేపథ్యంలో రోజా వ్యవహారంపై కమిటీ నివేదిక ఎలా ఉండబోతోందన్నది అసక్తికరంగా మారింది.
రోజా వ్యవహారంతోపాటు ఆరోజు సభలో ఏంజరిగిందన్న దాన్ని కూడా కమిటీ బయటపెడితే బాగుంటుందని వైసీపీ అంటోంది. ఒకవేళ కమిటీలో తమ సూచనలకు విలువ లేకపోతే వైదొలగాలన్న ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. దీనికి వైసీపీ నేతలు కారణాలు కూడా చూపిస్తున్నారు. కమిటీలో ఉన్న సభ్యుల్లో ముగ్గురు కూడా అధికారపక్షానికి మద్దతుగా ఉంటారని.. మిగిలిన ఒక్కరు ఏం సూచనలు చేసినా మెజారిటీ సభ్యుల మాటలే పరిగణలోకి తీసుకుంటారని వైసీపీ అంటోంది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ నియమించిన కమిటీ నిష్సక్షపాతంగా విచారణ జరిపే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్నదే ఇప్పుడు చర్చ.
First Published:  2 Jan 2016 12:03 PM GMT
Next Story