Telugu Global
Cinema & Entertainment

ఆ భామతోనే ఫిక్స్ అయిన అఖిల్

తన తొలి సినిమాలో సాయేషా సైగల్ తో ఆడిపాడాడు అక్కినేని అఖిల్. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ… సాయేషా అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జనాలే కాదు… అఖిల్ కూడా ఫ్లాట్ అయ్యాడు. అందుకే వరుసగా తన రెండో సినిమాలో కూడా సాయేషానే హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు అఖిల్. ప్రస్తుతానికైతే అఖల్ సెకెండ్ ప్రాజెక్టు కన్ ఫర్మ్ కాలేదు. పూరీ జగన్నాధ్, క్రిష్, శ్రీనువైట్ల లాంటి దర్శకులు ఇప్పటికే కథలు చెప్పారు. మరోవైపు హిందీలో […]

ఆ భామతోనే ఫిక్స్ అయిన అఖిల్
X
తన తొలి సినిమాలో సాయేషా సైగల్ తో ఆడిపాడాడు అక్కినేని అఖిల్. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ… సాయేషా అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జనాలే కాదు… అఖిల్ కూడా ఫ్లాట్ అయ్యాడు. అందుకే వరుసగా తన రెండో సినిమాలో కూడా సాయేషానే హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు అఖిల్. ప్రస్తుతానికైతే అఖల్ సెకెండ్ ప్రాజెక్టు కన్ ఫర్మ్ కాలేదు. పూరీ జగన్నాధ్, క్రిష్, శ్రీనువైట్ల లాంటి దర్శకులు ఇప్పటికే కథలు చెప్పారు. మరోవైపు హిందీలో హిట్టయిన ఏ జవానీ హే దీవానీ సినిమాను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో కూడా అఖిల్ ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే అఖిల్ రెండో సినిమాపై క్లారిటీ వస్తుంది. సినిమా ఏదైనా, దర్శకుడు ఎవరైనా… హీరోయిన్ గా మాత్రం సాయేషానే తీసుకోవాలనే అఖిల్ ఇప్పటికే మెంటల్లీ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం…. బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్…. అఖిల్ తో ఏ జవానీ… సినిమాను రీమేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
First Published:  1 Jan 2016 7:04 PM GMT
Next Story