Telugu Global
Cinema & Entertainment

స్టార్లు.... కొత్త ఏడాది...కొత్త కోరికలు...

నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. మన తారలు కూడా అలాంటివే కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. అయితే ఎవరూ నంబర్ వన్ అయిపోవాలనే గోల్ పెట్టుకోలేదు. కొందరైతే మరీ గమ్మత్తైన కోరికలు కోరుకుంటున్నారు. అసలు మన తారలు, 2016లో వాళ్ల ఆశయాలేంటో చూద్దాం. సౌత్ లో దుమ్ముదులిపిన కాజల్ కు ఇంకా ఏదో సాధించేద్దామనే కోరికలు పెద్దగా లేవట. డబ్బు సంపాదించాలనే ఆశ కూడా లేదట. మరి ఈ ఏడాది ఆమె ఏం చేయబోతోందంటే…. […]

స్టార్లు.... కొత్త ఏడాది...కొత్త కోరికలు...
X
నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొన్ని లక్ష్యాలు పెట్టుకుంటారు. మన తారలు కూడా అలాంటివే కొన్ని గోల్స్ పెట్టుకున్నారు. అయితే ఎవరూ నంబర్ వన్ అయిపోవాలనే గోల్ పెట్టుకోలేదు. కొందరైతే మరీ గమ్మత్తైన కోరికలు కోరుకుంటున్నారు. అసలు మన తారలు, 2016లో వాళ్ల ఆశయాలేంటో చూద్దాం.
సౌత్ లో దుమ్ముదులిపిన కాజల్ కు ఇంకా ఏదో సాధించేద్దామనే కోరికలు పెద్దగా లేవట. డబ్బు సంపాదించాలనే ఆశ కూడా లేదట. మరి ఈ ఏడాది ఆమె ఏం చేయబోతోందంటే…. వస్తున్న సినిమా ఆఫర్లకు కాల్షీట్లు కేటాయించడంతో పాటు…. యోగా చేయాలని నిర్ణయించుకుంది. మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా డిఫరెంట్ గా స్పందించింది. కనీసం ఈ ఏడాదైనా కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటున్నట్టు వెల్లడించింది. మరో బ్యూటీ శ్రియ మార్షల్ ఆర్ట్స్, కంచె హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తెలుగు నేర్చుకోవాలనే కోరికల్ని వెల్లడించారు.
హీరోయిన్ త్రిష… ప్రతి ఏడాదిలానే ఈ ఏడాదిని గడిపేస్తానని చెబుతుంటే…. మరో హీరోయిన్ ప్రణీత మాత్రం కనీసం ఈ ఏడాదైనా పని-కుటుంబాన్ని బ్యాలెన్స్ చేస్తానంటోంది. హీరోయిన్ తాప్సి అయితే వృధా చేయకుండా భోజనం చేస్తానని మొక్కుకుంటే…. రకుల్ ప్రీత్ సింగ్, ఏడాదంటే సెట్స్ పైనే గడపాలని కోరుకుంటోంది.
First Published:  31 Dec 2015 7:03 PM GMT
Next Story