Telugu Global
National

అద్నాన్ సమీ భారతీయుడే

అద్నాన్ సమీ. ఈపేరు బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతం. పాకిస్థాన్ దేశీయుడైన అద్నాన్ సమీ పాడిన ఎన్నో పాటలు భారతీయు ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. ఇప్పుడు అద్నాన్ సమీ భారతీయుడు అయ్యాడు. 14ఏళ్ల క్రితం విజిటింగ్ వీసాతో భారత్ లో అడుగుపెట్టిన సమీ తన పాటలతో ఎంతో మందికి చేరువయ్యాడు. అప్పట్లో భారీగా బరువు పెరిగన సమీ ఏకంగా తన బరువు 230 కిలోలకు పెరిగాడు. దీంతో ఊబకాయంతో సమీ బాధపడేవాడు. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం భారత్ […]

అద్నాన్ సమీ భారతీయుడే
X
అద్నాన్ సమీ. ఈపేరు బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతం. పాకిస్థాన్ దేశీయుడైన అద్నాన్ సమీ పాడిన ఎన్నో పాటలు భారతీయు ప్రేక్షకుల మదిని దోచుకున్నాయి. ఇప్పుడు అద్నాన్ సమీ భారతీయుడు అయ్యాడు. 14ఏళ్ల క్రితం విజిటింగ్ వీసాతో భారత్ లో అడుగుపెట్టిన సమీ తన పాటలతో ఎంతో మందికి చేరువయ్యాడు. అప్పట్లో భారీగా బరువు పెరిగన సమీ ఏకంగా తన బరువు 230 కిలోలకు పెరిగాడు. దీంతో ఊబకాయంతో సమీ బాధపడేవాడు. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం భారత్ లోనే చాలా కాలంగా ఉండిపోయాడు. ఇప్పుడు అద్నాన్ సమీ బరువు కేవలం 75 కిలోలే.
తాజాగా మానవతా దృక్పథంతో తనకు భారతదేశ పౌరసత్వం ఇవ్వాలంటూ అద్నాన్ సమీ కేంద్రం ప్రభుత్వానికి దరఖాస్తు చేశాడు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం అతడికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఈ సందర్భంగా నిన్న ఢిల్లీలో హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజుజు అద్నాన్ సమీకి భారత పౌరసత్వం అందజేశారు. తనకు భారతీయ పౌరసత్వం రాగానే అద్నాన్ సమీ ఆనందంతో జై హింద్ అంటూ ట్విట్టర్ లో తొలి పోస్ట్ పెట్టాడు. భారతీయుడిగా పౌరసత్వం అందుకోవడం హ్యాపీగా ఉందన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ధన్యవాదాలు తెలిపారు. ఇది తనకు పునర్జన్మ అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత్ లో భారత్ లో అసహనం లేదని సమీ అన్నాడు. అసహనమే ఉంటే పాకిస్తానీ అయిన తనకు భారత్ పౌరసత్వం వచ్చేది కాదన్నాడు. మొత్తం మీద ఇప్పుడు అద్నాన్ సమీకి పౌరసత్వం తర్వాత భారత్ సహనానికి ప్రతీక అని ట్విట్టర్ లో పోస్ట్ లు పెడుతున్నారు.
Next Story