Telugu Global
Cinema & Entertainment

ముగ్గురూ అలా ఎంజాయ్ చేశారు

ఫేవరెట్ స్టార్లు నూతన సంవత్సర వేడుకల్ని ఎక్కడ, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈమధ్య తారలు కూడా తమ వేడుకల్ని ఏదో ప్రైవేటు వ్యవహారంలా కాకుండా…. ఎలా ఎంజాయ్ చేశామనే విషయాన్ని అభిమానులకు వెల్లడిస్తున్నారు. అలా ముగ్గురు తారలు… పొద్దున్నే తమ 31 రాత్రి అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ నంబర్ వన్ హీరో సల్మాన్ ఖాన్….. నూతన సంవత్సర వేడుకల్ని తన ఫాం హౌజ్ లోనే జరుపుకున్నాడు. మొన్నటికి మొన్న తన […]

ముగ్గురూ అలా ఎంజాయ్ చేశారు
X
ఫేవరెట్ స్టార్లు నూతన సంవత్సర వేడుకల్ని ఎక్కడ, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనే విషయంపై అందరికీ ఆసక్తి ఉంటుంది. ఈమధ్య తారలు కూడా తమ వేడుకల్ని ఏదో ప్రైవేటు వ్యవహారంలా కాకుండా…. ఎలా ఎంజాయ్ చేశామనే విషయాన్ని అభిమానులకు వెల్లడిస్తున్నారు. అలా ముగ్గురు తారలు… పొద్దున్నే తమ 31 రాత్రి అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ నంబర్ వన్ హీరో సల్మాన్ ఖాన్….. నూతన సంవత్సర వేడుకల్ని తన ఫాం హౌజ్ లోనే జరుపుకున్నాడు. మొన్నటికి మొన్న తన 50వ జన్మదిన వేడుకల్ని కూడా ఇక్కడే జరుపుకున్న కండలరాజా…. న్యూ ఇయర్ కు కూడా ఫాం హౌజ్ వీడలేదు. అటు సల్మాన్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి మాత్రం ఎంచక్కా దుబాయ్ చెక్కేసింది. దుబాయ్ లోని అతిపెద్ద టవర్ వద్ద…. ఎక్స్ క్లూజివ్ గా న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకున్నానని తెలిపింది. మరో తార శృతిహాసన్ కూడా తన నూతన సంవత్సర వేడుకల్ని వెల్లడించింది. లండన్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలనే తన చిరకాల కోరికను తీర్చుకున్నట్టు తెలిపిన శృతిహాసన్…. ఏడాదికి సరపడా ఆనందాన్నిసంపాదించినట్టు వెల్లడించింది.
Next Story