Telugu Global
Cinema & Entertainment

ఔను ..ల‌వ్ లో ప‌డ్డాను..!

బాలీవుడ్ జంట రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొన్ పీకల్లోతు ప్రేమలో ముగినితేలుతున్నట్టు కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తరచూ సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తుంటారు. రణ్ వీర్, దీపిక అనుబంధం బాలీవుడ్ లో హాట్ టాపిక్. అయితే తమ అనుబంధం గురించి ఈ జంట ఇప్పటి వరకు ఔనని కానీ కాదని కానీ చెప్పలేదు. రణ్ వీర్ తన అనుబంధం గురించి ఇటీవల నోరు విప్పాడు. తాను ప్రేమలోపడ్డానని, ఒకరితో […]

ఔను ..ల‌వ్ లో ప‌డ్డాను..!
X

బాలీవుడ్ జంట రణ్ వీర్ సింగ్, దీపిక పదుకొన్ పీకల్లోతు ప్రేమలో ముగినితేలుతున్నట్టు కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తరచూ సినిమా ఫంక్షన్లు, పార్టీల్లో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తుంటారు. రణ్ వీర్, దీపిక అనుబంధం బాలీవుడ్ లో హాట్ టాపిక్. అయితే తమ అనుబంధం గురించి ఈ జంట ఇప్పటి వరకు ఔనని కానీ కాదని కానీ చెప్పలేదు.

రణ్ వీర్ తన అనుబంధం గురించి ఇటీవల నోరు విప్పాడు. తాను ప్రేమలోపడ్డానని, ఒకరితో అనుబంధముందని రణ్ వీర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సిన్సియర్ గా ప్రేమిస్తున్నానని వెల్లడించాడు. తమ అనుబంధం బాగుందని, ఇలాంటి అనుభూతి గతంలో ఎప్పుడూ చవిచూడలేదన్నాడు. ఇంకేముంది రణ్ వీర్ ప్రేయసి దీపికేనని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. రణ్‌వీర్‌సింగ్‌, దీపిక నటించిన బాజీరావు మస్తానీ విజయం సాధించడంతో ఈ జంట మంచి జోష్ తో ఉన్నారు. కాగా గతంలో దీపిక కొందరితో ఎఫైర్ సాగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ జాబితాలో మరో బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ పేరు కూడా ఉంది.

First Published:  31 Dec 2015 7:15 PM GMT
Next Story