Telugu Global
NEWS

సంక్రాంతికి వెళ్లండి... వచ్చాకే ఓట్లేసుకుందాం

ఒకప్పుడు ఆంధ్ర ఓటర్లంటేనే గిట్టని తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తన వైఖరి పూర్తిగా మార్చుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ఓటర్ల మదిని దోచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రి కేటీఆర్ ఇతర ముఖ్య నేతలంతా సెటిలర్లందరికీ అండగా ఉంటామని.. హైదరాబాద్ మినీ ఇండియా లాంటిదని చెప్పుకొస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా మరింత క్లారిటీ ఇచ్చారు. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు […]

సంక్రాంతికి వెళ్లండి... వచ్చాకే ఓట్లేసుకుందాం
X
ఒకప్పుడు ఆంధ్ర ఓటర్లంటేనే గిట్టని తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు తన వైఖరి పూర్తిగా మార్చుకుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్ర ఓటర్ల మదిని దోచుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మంత్రి కేటీఆర్ ఇతర ముఖ్య నేతలంతా సెటిలర్లందరికీ అండగా ఉంటామని.. హైదరాబాద్ మినీ ఇండియా లాంటిదని చెప్పుకొస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా మరింత క్లారిటీ ఇచ్చారు. ఉప్పల్‌ నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు కేటీఆర్‌, పద్మారావు సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అంటే మినీ ఇండియా అని, ఆంధ్రాతోపాటు ఎవరు వచ్చినా వారి సంక్షేమం కోసం టీఆర్‌ఎస్‌ పని చేస్తుందని కేటీఆర్ అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను సీమాంధ్ర ఓటర్లు సంక్రాంతికి వెళ్లాక నిర్వహిస్తారన్న ప్రచారాన్ని మంత్రి కేటీఆర్ కొట్టిపారేశారు. ఆంధ్రా ఓటర్లు సంక్రాంతి పండుగకు వెళ్లొచ్చాకే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయని కేటీఆర్ స్పష్టం చేశారు. సీమాంధ్ర ఓట్లతోనే తాము గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాయి. వారి మాటలను పట్టించుకోవద్దు.. సెటిలర్లు ఎవ్వరూ భయపడొద్దు. ఇక్కడ ఆంధ్రోళ్లకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడే ధైర్యంగా ఉంటున్నారు. ఇక ముందు కూడా ఉంటారు. కొంత మంది టీఆర్ఎస్ పై అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని, హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఓటేయాలని కేటీఆర్ సూచించారు.
తెలంగాణ నుంచి విడిపోయినందునే ఆంధ్రా ప్రాంతానికి కొత్త రాజధాని, ఎయిమ్స్‌, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు తదితర అభివృద్ధి ప్రాజెక్టులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ప్రాంతాలుగా విడిపోయినా తెలుగు ప్రజలుగా కలిసి ఉందామని కేటీఆర్ పిలుపు నిచ్చారు. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సీమాంధ్ర ఓటర్ల మనసు దోచుకునేందుకు ఎలాంటి హామీలు ఇస్తుందో చూడాలి
First Published:  31 Dec 2015 1:01 PM GMT
Next Story