Telugu Global
Cinema & Entertainment

బీప్ సాంగ్ కథ పరిసమాప్తం

తమిళనాట వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో… దాని కొనసాగింపుగా బీప్ సాంగ్ కూడా అంతే సంచలనం సృష్టించింది. శింబు-అనిరుధ్ కలిసి కంపోజ్ చేసిన ఈ బీప్ సాంగ్…. వై దిస్ కొలవరి పాట అంత పాపులర్ అయిపోతుందనుకుంటే…. రివర్స్ లో అతిపెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం ఎంత ముదిరిందంటే…. శింబుపై కేసులు వేయడం… అతడు అరెస్ట్ తప్పించుకునేందుకు పరారైపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిన్నటివరకు శింబు అజ్ఞాత ప్రదేశంలోనే గడిపాడు. తాజాగా ఈ వివాదానికి ఫుల్ […]

బీప్ సాంగ్ కథ పరిసమాప్తం
X
తమిళనాట వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో… దాని కొనసాగింపుగా బీప్ సాంగ్ కూడా అంతే సంచలనం సృష్టించింది. శింబు-అనిరుధ్ కలిసి కంపోజ్ చేసిన ఈ బీప్ సాంగ్…. వై దిస్ కొలవరి పాట అంత పాపులర్ అయిపోతుందనుకుంటే…. రివర్స్ లో అతిపెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం ఎంత ముదిరిందంటే…. శింబుపై కేసులు వేయడం… అతడు అరెస్ట్ తప్పించుకునేందుకు పరారైపోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. నిన్నటివరకు శింబు అజ్ఞాత ప్రదేశంలోనే గడిపాడు. తాజాగా ఈ వివాదానికి ఫుల్ స్పాట్ పడింది. కేసు వేసిన మహిళా సంఘాలతో పాటు…. శింబు కూడా వెనక్కి తగ్గడంతో వివాదం ముగిసింది. మహిళా సంఘాలు, అడ్వకేట్లు… తాము వేసిన కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అటు శింబు కూడా వివాదాస్పద బీప్ సాంగ్ ను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. తన సినిమాలో ఆ పాటను పెట్టనని మాటిచ్చాడు. దీంతో పోలీసులు శింబు కోసం వేటాడ్డం ఆపేశారు. అలా శింబు మొత్తానికి ఒడ్డున పడ్డాడు.
First Published:  31 Dec 2015 7:14 PM GMT
Next Story