Telugu Global
NEWS

ఆస్పత్రిలో విద్యాబాలన్- న్యూ ఇయర్ వేడుకలు క్యాన్సిల్

బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాలన్ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ముంబాయిలోని హిందుజా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. శనివారం నాటికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. న్యూఇయర్ వేడుకలను భర్తతో కలిసి విదేశాల్లో జరుపుకోవాలని విద్యా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే […]

ఆస్పత్రిలో విద్యాబాలన్- న్యూ ఇయర్ వేడుకలు క్యాన్సిల్
X

బాలీవుడ్ హీరోయిన్‌ విద్యాబాలన్ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరారు. ముంబాయిలోని హిందుజా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెబుతున్నారు. శనివారం నాటికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. న్యూఇయర్ వేడుకలను భర్తతో కలిసి విదేశాల్లో జరుపుకోవాలని విద్యా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే విపరీతమైన పెయిన్ రావడంతో ఆస్పత్రికి వచ్చారు. సో ఈ ఏడాది విద్యాబాలన్ న్యూఇయర్ ఆస్పత్రిలోనే అన్నమాట.

First Published:  31 Dec 2015 4:24 AM GMT
Next Story