Telugu Global
Cinema & Entertainment

తొందరపడకు శర్వానందు..!

క్లీన్ హీరో ఇమేజ్ ఉంది… రీసెంట్ హిట్స్ తో మంచి ట్రాక్ రికార్డు ఉంది…. అన్నింటికీ మించి ఈమధ్య కుర్రాడికి బాగా లక్ కలిసొస్తోంది. ఇలాంటి టైమ్ లో శర్వానంద్ తొందరపడ్డం అంత మంచిది కాదంటున్నారు చాలామంది. ప్రస్తుతం ఈ హీరో  ఎక్స్ ప్రెస్ రాజా అనే సినిమా చేశాడు. సినిమా కంప్లీట్ అయింది. వచ్చేది సంక్రాంతి సీజన్. అసలే మనోడు హిట్స్ తో ఊపుమీదున్నాడు. దీంతో ఎక్స్ ప్రెస్ రాజా సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని […]

తొందరపడకు శర్వానందు..!
X
క్లీన్ హీరో ఇమేజ్ ఉంది… రీసెంట్ హిట్స్ తో మంచి ట్రాక్ రికార్డు ఉంది…. అన్నింటికీ మించి ఈమధ్య కుర్రాడికి బాగా లక్ కలిసొస్తోంది. ఇలాంటి టైమ్ లో శర్వానంద్ తొందరపడ్డం అంత మంచిది కాదంటున్నారు చాలామంది. ప్రస్తుతం ఈ హీరో ఎక్స్ ప్రెస్ రాజా అనే సినిమా చేశాడు. సినిమా కంప్లీట్ అయింది. వచ్చేది సంక్రాంతి సీజన్. అసలే మనోడు హిట్స్ తో ఊపుమీదున్నాడు. దీంతో ఎక్స్ ప్రెస్ రాజా సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలని పట్టుబడుతున్నాడు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుందంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికే సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు లైన్లో ఉన్నాయి. ఎన్టీఆర్ నటిస్తున్న నాన్నకు ప్రేమతో, బాలయ్య డిక్టేటర్ మూవీతో పాటు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. ఇలాంటి 3 పెద్ద చిత్రాల మధ్య తన సినిమాను ఇరికించాలని చూస్తున్నాడు శర్వానంద్. ఇతడికి హిట్స్ అయితే ఉండొచ్చు. కానీ మాస్ ఫాలోయింగ్ మాత్రం లేదు. ఈ విషయం గుర్తెరిగి సినిమా విడుదల చేస్తే బాగుంటుంది. మరోవైపు శర్వానంద్ సినిమాకు థియేటర్లు కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఓవైపు ఎక్స్ ప్రెస్ రాజా ఇన్ సైడ్ టాక్ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో… సంక్రాంతి పేరు చెప్పి సినిమాను అడ్డంగా ఖూనీ చేయొద్దని సన్నిహితులు సూచిస్తున్నారు. మరి శర్వానంద్ మాట వింటాడో లేదో చూడాలి.
First Published:  30 Dec 2015 7:02 PM GMT
Next Story