Telugu Global
Cinema & Entertainment

మహేష్ కోసం కృష్ణ పాత సినిమా టైటిళ్లు

త్వరలోనే మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఆ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడదామనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. మొన్నటి వరకు ఈ సినిమాకు చట్టంతో పోరాటం అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా ఎనిమి అనే మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ రెండూ కాకుండా… కృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా టైటిళ్లను కూడా పరిశీలించాలని మహేష్ కోరాడట. […]

మహేష్ కోసం కృష్ణ పాత సినిమా టైటిళ్లు
X
త్వరలోనే మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి స్క్రీన్ ప్లే కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఆ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడదామనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. మొన్నటి వరకు ఈ సినిమాకు చట్టంతో పోరాటం అనే టైటిల్ అనుకున్నారు. కానీ తాజాగా ఎనిమి అనే మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఈ రెండూ కాకుండా… కృష్ణ నటించిన సూపర్ హిట్ సినిమా టైటిళ్లను కూడా పరిశీలించాలని మహేష్ కోరాడట. మరోవైపు మురుగదాస్ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. మూడు భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి… అందరికీ రీచ్ అయ్యేలా ఓ కామన్ టైటిల్ పెడితే బాగుంటుందని సూచిస్తున్నాడట. ప్రస్తుతానికైతే సినిమా బృందంలో కొందరు కృష్ణ పాత సినిమా పేర్లను పరీక్షిస్తుంటే… మరికొందరు కొత్త టైటిల్స్ అన్వేషణలో పడ్డారు. మరోవైపు మురుగదాస్ హీరోయిన్ అన్వేషణలో పడ్డాడు. మురుగదాస్-మహేష్ ప్రాజెక్ట్…. ఏప్రిల్ నెల నుంచి సెట్స్ పైకి వస్తుంది.
First Published:  30 Dec 2015 7:06 PM GMT
Next Story