Telugu Global
Cinema & Entertainment

అప్పుడే ఓ షెడ్యూల్ పూర్తిచేసిన రజనీకాంత్

శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వెల్ పట్టాలపైకి రావడమే ఒక ఆశ్చర్యమనుకుంటే…. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి రజనీకాంత్ అప్పుడే ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశాడనే వార్త ప్రేక్షకుల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అవును… చిట్టి 2.0 సినిమా రోబో కంటే స్పీడుగా పరుగులుపెడుతోంది. నిన్నగాక మొన్న ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ అప్పుడే ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. చెన్నై శివార్లలో దాదాపు 15 రోజుల పాటు ఈ షూటింగ్ […]

అప్పుడే ఓ షెడ్యూల్ పూర్తిచేసిన రజనీకాంత్
X
శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వెల్ పట్టాలపైకి రావడమే ఒక ఆశ్చర్యమనుకుంటే…. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి రజనీకాంత్ అప్పుడే ఓ షెడ్యూల్ కూడా పూర్తిచేశాడనే వార్త ప్రేక్షకుల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. అవును… చిట్టి 2.0 సినిమా రోబో కంటే స్పీడుగా పరుగులుపెడుతోంది. నిన్నగాక మొన్న ప్రారంభమైన ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ అప్పుడే ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు. చెన్నై శివార్లలో దాదాపు 15 రోజుల పాటు ఈ షూటింగ్ జరిగింది. రేపట్నుంచి కబలి షూటింగ్ లో జాయిన్ అవుతాడు రజనీ. ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్లో నటిస్తాడు. అది కంప్లీట్ అయిన వెంటనే… జనవరి 11 నుంచి తిరిగి చిట్టి 2.0 సినిమా సెట్స్ లో ప్రత్యక్షమౌతాడు. ఇలా లేటు వయసులో కూడా కుర్రహీరోలతో సమానంగా దూసుకుపోతున్నాడు రజనీకాంత్. చిట్టి 2.0 సినిమాలో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్నాడు. సెకెండ్ షెడ్యూల్ లో అక్షయ్ కుమార్ నటించే సన్నివేశాల్ని తెరకెక్కించే అవకాశముంది. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ ఆర్ రెహ్మాన్ సంగీత దర్శకుడు.
Next Story