Telugu Global
Cinema & Entertainment

డిక్టేటర్ తో చేతులు కలిపిన దిల్ రాజు

డిక్టేటర్ మూవీకి సంబంధించి నైజాం హక్కుల్ని దిల్ రాజు దక్కించుకున్నాడు. అప్పట్లో ఈ హక్కులకు సంబంధించి చాలా వివాదం నడిచింది. ఒక దశలో దిల్ రాజు ఆ హక్కుల్ని వదులుకున్నాడు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థే సొంతంగా డిక్టేటర్ సినిమాని నైజాంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే మళ్లీ పరిస్థితులు మారడంతో…. ఎరోస్ వెనక్కితగ్గింది. మరోసారి దిల్ రాజును సంప్రదించి… అతడికే డిక్టేటర్ నైజాం రైట్స్ కట్టబెట్టింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు […]

డిక్టేటర్ తో చేతులు కలిపిన దిల్ రాజు
X
డిక్టేటర్ మూవీకి సంబంధించి నైజాం హక్కుల్ని దిల్ రాజు దక్కించుకున్నాడు. అప్పట్లో ఈ హక్కులకు సంబంధించి చాలా వివాదం నడిచింది. ఒక దశలో దిల్ రాజు ఆ హక్కుల్ని వదులుకున్నాడు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థే సొంతంగా డిక్టేటర్ సినిమాని నైజాంలో విడుదల చేయడానికి సిద్ధమైంది. అయితే మళ్లీ పరిస్థితులు మారడంతో…. ఎరోస్ వెనక్కితగ్గింది. మరోసారి దిల్ రాజును సంప్రదించి… అతడికే డిక్టేటర్ నైజాం రైట్స్ కట్టబెట్టింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్య ఎప్పట్నుంచో ఉంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో… స్వయంగా బాలయ్య రంగంలోకి దిగి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారని సమాచారం. అలా ఫైనల్ గా డిక్టేటర్ టీంలోకి దిల్ రాజు కూడా ఎంటరయ్యాడు. బాలయ్య సినిమా నైజాం రైట్స్ ఎంత మొత్తానికి అమ్ముడుపోయాయనే విషయం తెలియరాలేదు. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా డిక్టేటర్ సినిమా విడుదలకానుంది.
First Published:  30 Dec 2015 7:07 PM GMT
Next Story