Telugu Global
Cinema & Entertainment

దడుసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు

‘లౌక్యం’తో సూపర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌.. కోన వెంకట్‌, గోపీమోహన్‌, శ్రీధర్‌ సీపాన, రత్నం లాంటి నలుగురు పేరున్న రచయితలు కలిసి సిద్ధం చేసిన కథ.. పైగా బాలయ్య హీరో.. అందులోనూ ‘డిక్టేటర్‌’ లాంటి పవర్‌ ఫుల్‌ టైటిల్‌.. ఇంతకంటే ఏం కావాలి ఓ సినిమాకు క్రేజ్‌ రావడానికి.. బయ్యర్లు ఎగబడ్డానికి. సినిమాకు కొన్ని నెలలుండగానే బిజినెస్‌ కూడా అయిపోవడంతో ఉత్సాహంగా సినిమాను పూర్తి చేశాడు శ్రీవాస్‌. కానీ సరిగ్గా విడుదలకు ముందు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అడ్డం […]

దడుసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు
X

‘లౌక్యం’తో సూపర్‌ హిట్‌ కొట్టిన డైరెక్టర్‌.. కోన వెంకట్‌, గోపీమోహన్‌, శ్రీధర్‌ సీపాన, రత్నం లాంటి నలుగురు పేరున్న రచయితలు కలిసి సిద్ధం చేసిన కథ.. పైగా బాలయ్య హీరో.. అందులోనూ ‘డిక్టేటర్‌’ లాంటి పవర్‌ ఫుల్‌ టైటిల్‌.. ఇంతకంటే ఏం కావాలి ఓ సినిమాకు క్రేజ్‌ రావడానికి.. బయ్యర్లు ఎగబడ్డానికి. సినిమాకు కొన్ని నెలలుండగానే బిజినెస్‌ కూడా అయిపోవడంతో ఉత్సాహంగా సినిమాను పూర్తి చేశాడు శ్రీవాస్‌. కానీ సరిగ్గా విడుదలకు ముందు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అడ్డం పడుతున్నారట. ‘డిక్టేటర్‌’ సినిమాకు ముందు అగ్రిమెంట్‌ చేసుకున్న మొత్తం చెల్లించడానికి ససేమిరా అంటున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోందిప్పుడు.

‘డిక్టేటర్‌’ మీద అపనమ్మకం అని కాదు కానీ.. సంక్రాంతి రేసులో మరో మూడు క్రేజున్న సినిమాలుండటమే డిస్ట్రిబ్యూటర్ల భయానికి కారణం. నాన్నకు ప్రేమతో, సోగ్గాడే చిన్నినాయనా, ఎక్స్‌ప్రెస్‌ రాజా సినిమాలు కూడా మంచి క్రేజ్‌ మధ్య రిలీజవుతున్నాయి. పైగా ఆ సినిమాల్లో వైవిధ్యం కనిపిస్తోంది. ‘డిక్టేటర్‌’ కొంచెం రొటీన్‌ సినిమాలాగే ఉంది. పైగా కోన వెంకట్‌, గోపీమోహన్‌, శ్రీధర్‌ సీపాన వరుస ఫెయిల్యూర్లలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో బాలయ్య సినిమాలన్నింట్లోకి రికార్డు ప్రైస్‌ పెట్టి హక్కులు తీసుకోవడానికి అగ్రిమెంట్‌ చేసుకున్న బయ్యర్లు.. ఇప్పుడు అంత మొత్తం చెల్లించడానికి భయపడుతున్నట్లు సమాచారం. సినిమాకు మంచి టాక్‌ వచ్చినా.. పోటీ దృష్ట్యా పెట్టుబడి రాబట్టుకోవడం చాలా కష్టమని వారు భయపడుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారాన్ని ఎలా సెటిల్‌ చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడట దర్శక నిర్మాత శ్రీవాస్‌. మరి ఈ వ్యవహారం ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.ఒక‌ప్పుడు బాల‌య్య చిత్రం రిలీజ్ అవుతుంది అంటే మిగిలిన చిన్న హీరోలు..ఒక మాదిరి మార్కెట్ వున్న హీరోలు.. త‌మ చిత్రాల రిలీజ్ ను వాయిదా వేసుకున్న సంద‌ర్భాలున్నాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బాల‌య్య చిత్రం రిలీజ్ అవుతుంది అంటే దానికి పోటీగా రావ‌డానికి ఏ మాత్రం సంకోచించ‌డం లేదు.! మ‌రి ఈ డెవ‌ల‌ప్ మెంట్ ను ఎలా అర్ధం చేసుకోవాలో ఫ్యాన్స్ కే తెలియాలి.

Click to Read :

jagan-nandamuri-fans

dictator-balakrishna

First Published:  30 Dec 2015 7:08 PM GMT
Next Story