Telugu Global
Others

"నీ కొడుకు ఆడాలంటే రాత్రికి రా..."

ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అరుణ్‌ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు మరో తీవ్ర ఆరోపణాస్త్రాన్ని సంధించారు. ఢిల్లీ టీంకు ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలోనూ అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు. డీడీసీఏ అధికారి ఒకరిపై లైంగిక ఆరోపణలు  కేజ్రీవాల్ చేశారు. ఢిల్లీ క్రికెట్‌ టీంకు ఒక జర్నలిస్ట్ కుమారుడు ఎంపికయ్యారని.. అయితే సాయంత్రానికి అతడి పేరును లిస్ట్ నుంచి తొలగించారని చెప్పారు. […]

నీ కొడుకు ఆడాలంటే రాత్రికి రా...
X

ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అవినీతి వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. అరుణ్‌ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పుడు మరో తీవ్ర ఆరోపణాస్త్రాన్ని సంధించారు. ఢిల్లీ టీంకు ఆటగాళ్లను ఎంపిక చేసే విషయంలోనూ అనేక అక్రమాలు జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు. డీడీసీఏ అధికారి ఒకరిపై లైంగిక ఆరోపణలు కేజ్రీవాల్ చేశారు.

ఢిల్లీ క్రికెట్‌ టీంకు ఒక జర్నలిస్ట్ కుమారుడు ఎంపికయ్యారని.. అయితే సాయంత్రానికి అతడి పేరును లిస్ట్ నుంచి తొలగించారని చెప్పారు. తిరిగి అతడిని జట్టులోకి తీసుకోవాలంటే ఒక రాత్రికి తన ఇంటికి రావాలంటూ జర్నలిస్ట్ భార్యకు డీడీసీఏ అధికారి మేసేజ్ పంపారని కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. కుమారుడి భవిష్యత్తును బూచిగా చూపెట్టి సదరు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ వెల్లడించారు. అయితే సదరు బాధితురాలి పేరు బయటపెట్టేందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. విచారణ కమిటీ ముందు ఈ విషయాన్ని చెప్పేందుకు సదరు మహిళ సిద్ధంగా ఉన్నారన్నారు.. ఈ సంఘటన కూడా అరుణ్‌ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే జరిగిందన్నారు.

First Published:  30 Dec 2015 5:42 AM GMT
Next Story