Telugu Global
Others

సెక్స్ స్కాండలా!... అంటే వారంతా అలాంటివారేననా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ”విజయవాడ అంతా కాల్‌మనీ సెక్స్‌ స్కాండల్ అయిందని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ ఊరిలో ఉన్నవారంతా అలాంటివారేననా?… ప్రతిసారి క్రైమ్ సిటీ అంటారు. అంటే క్రైమ్ సిటీ కావాలి. ఇక్కడికి ఎవరూ రాకూడదు అన్నది వారి ఉద్దేశం, ఇంత నీచ రాజకీయాలు ఎందుకండి?” అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయాల కోసం రాయలసీమ […]

సెక్స్ స్కాండలా!... అంటే వారంతా అలాంటివారేననా?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ”విజయవాడ అంతా కాల్‌మనీ సెక్స్‌ స్కాండల్ అయిందని ప్రచారం చేస్తున్నారు. అంటే ఈ ఊరిలో ఉన్నవారంతా అలాంటివారేననా?… ప్రతిసారి క్రైమ్ సిటీ అంటారు. అంటే క్రైమ్ సిటీ కావాలి. ఇక్కడికి ఎవరూ రాకూడదు అన్నది వారి ఉద్దేశం, ఇంత నీచ రాజకీయాలు ఎందుకండి?” అని చంద్రబాబు ప్రశ్నించారు.

రాజకీయాల కోసం రాయలసీమ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారని సీఎం అన్నారు. అనంతపురం, కర్నూలు,చిత్తూరు ఎంతో అభివృద్ధి చెందాయని ఆ ప్రాంతాలు రాయలసీమలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ గురించి తనకు బాగా తెలుసన్నారు. ఉద్యోగుల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నానని చెప్పారు. కఠినంగా ఉంటే తనను మించినవారుండరని అన్నారు. ఐటీని ఉపయోగించుకుని సింపుల్‌గా పనిచేయడం నేర్చుకోవాలని ఉద్యోగులను సూచించారు. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందన్నారు. సుధీర్ఘ కాలం పాలించే అవకాశం ఇస్తే రాష్ట్రానికే మంచి జరుగుతుందన్నారు సీఎం.

YOU MAY ALSO LIKE

dictator-balakrishna

komatreddy

First Published:  30 Dec 2015 11:59 AM GMT
Next Story