Telugu Global
Cinema & Entertainment

ఒకే రోజు.... 7 సినిమాలు విడుదల... ఏది విజేత?

నూతన సంవత్సరం….తొలి రోజు…. ఒకేసారి 7 సినిమాలు విడుదల. అవును… కొత్త ఏడాదిలో తెలుగుచిత్ర సీమ ఫుల్ బూమ్ తో మొదలవుతోంది. జనవరి 1, 2016న ఒకేసారి 7 సినిమాలు బాక్సాఫీస్ ముందు సందడి చేయబోతున్నాయి. వీటిలో రామ్ నటించిన నేను శైలజ సినిమాతో పాటు…. వర్మ డైరక్ట్ చేసిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కిల్లింగ్ వీరప్పన్ కూడా ఉంది.  రామ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా నేను శైలజ. ఈ సినిమాను నూతన సంవత్సర […]

ఒకే రోజు.... 7 సినిమాలు విడుదల... ఏది విజేత?
X
నూతన సంవత్సరం….తొలి రోజు…. ఒకేసారి 7 సినిమాలు విడుదల. అవును… కొత్త ఏడాదిలో తెలుగుచిత్ర సీమ ఫుల్ బూమ్ తో మొదలవుతోంది. జనవరి 1, 2016న ఒకేసారి 7 సినిమాలు బాక్సాఫీస్ ముందు సందడి చేయబోతున్నాయి. వీటిలో రామ్ నటించిన నేను శైలజ సినిమాతో పాటు…. వర్మ డైరక్ట్ చేసిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ కిల్లింగ్ వీరప్పన్ కూడా ఉంది.
రామ్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా నేను శైలజ. ఈ సినిమాను నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఒక హిట్-ఒక ఫ్లాపుతో నెట్టుకొచ్చిన రామ్… 2016ను సక్సెస్ తో షురూ చేయాలనుకుంటున్నాడు. ఇక రామ్ సినిమాకు పోటీగా వర్మ తీసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా సిద్ధంగా ఉంది. ఇందులో నటీనటులు ఎవరనేది అప్రస్తుతం. వీరప్పన్ పై సినిమా కాబట్టి… టోటల్ సౌత్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు… నాగశౌర్య నటించిన అబ్బాయితో అమ్మాయి సినిమా కూడా లైన్లో ఉంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ. లోల్ (ఎల్ ఓ ఎల్), చిత్రం భలారే విచిత్రం, మలుపు, వెన్నెల్లో హాయ్ హాయ్ సినిమాలు లిస్ట్ లో మిగతావి. మరి వీటిలో నూతన సంవత్సరంలో ఏది హిట్‌ కొడుతుందో చూడాలి.
First Published:  28 Dec 2015 7:06 PM GMT
Next Story