Telugu Global
Others

ఓరేయ్‌... నీ అబ్బా.. సీఎం ఎప్పుడవుతావ్‌!

ఈ మధ్య పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్న ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఈ సారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. నిజంగా జగన్‌ మీద కోపమో లేక చంద్రబాబును శాంతపరిచే ప్రయోగమో గానీ అనంతపురం నీరు-ప్రగతి కార్యక్రమంలో  ఏపీ ముఖ్యమంత్రిని ఓ రేంజ్‌లో పొగిడేశారు. ”మహానుభావుడు, ఆయన చేయికి ఎముక లేదు, ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్ర చూడలేదు” అంటూ కాసేపు పొగడ్తల ప్రవాహం సృష్టించారు జేసీ. జగన్‌ను ”ఒరేయ్ నీ […]

ఓరేయ్‌... నీ అబ్బా.. సీఎం ఎప్పుడవుతావ్‌!
X

ఈ మధ్య పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్న ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఈ సారి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. నిజంగా జగన్‌ మీద కోపమో లేక చంద్రబాబును శాంతపరిచే ప్రయోగమో గానీ అనంతపురం నీరు-ప్రగతి కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రిని ఓ రేంజ్‌లో పొగిడేశారు. ”మహానుభావుడు, ఆయన చేయికి ఎముక లేదు, ఇలాంటి ముఖ్యమంత్రిని చరిత్ర చూడలేదు” అంటూ కాసేపు పొగడ్తల ప్రవాహం సృష్టించారు జేసీ.

జగన్‌ను ”ఒరేయ్ నీ బాధ ఏంటిరా?’ అంటూ ప్రశ్నించారు. జేసీ ఇంకా ఏమన్నారంటే ” ఎవరి జీవితంలోనైనా మనవడితో ఆడుకోవడమే మధురక్షణం. కానీ మన ముఖ్యమంత్రికి ఆ అవకాశం కూడా లేకుండాపోయింది. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి కోసం ఈయన వెళ్లినన్ని సార్లు ఢిల్లీకి ఏ ముఖ్యమంత్రి వెళ్లలేదు. కానీ చంద్రబాబుకు మంచిపేరు రాకూడదని మా వాడు జగన్‌ చెడగొడుతున్నాడు. వాడి కర్మ ఏందో అర్థం కావడం లేదు. ఓరేయ్ నీ అబ్బా ఇలా నీళ్లు రాకుండా అడ్డుకుంటే ఎప్పుడు అవుతావ్‌ రా నీవు ముఖ్యమంత్రి” అంటూ జగన్‌పై ప్రేమ పూర్వక విమర్శలు చేశారు జేసీ.

చంద్రబాబు చేతికి ఎముకనేదే లేదన్నారు. అడగ్గానే ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా అనంతపురం నగర అభివృద్దికి రూ. 80 కోట్లు మంజూరు చేశారని జేసీ చెప్పారు. చంద్రబాబు ఓ మహానుభావుడు అని పొడిగేశారు . అయితే జేసీ ఈ రేంజ్‌లో పొగుడుతున్నా చంద్రబాబు ముఖంలో పెద్దగా స్పందన కనిపించలేదు. జస్ట్ చూస్తూ ఉండిపోయారు.

Also Read పండితుల సలహా- ఐటీని తాకొద్దు !

lokesh-final

Rakul Preeth Singh latest Stills

RAKUL-PREET-NEW

First Published:  29 Dec 2015 9:54 AM GMT
Next Story