Telugu Global
Cinema & Entertainment

ఈ శైలజ చాలా క్లీన్...

రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా నేను శైలజ. మొన్నటివరకు హరికథ అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను నేను శైలజగా మార్చారు. శివమ్ సినిమా చట్టుబండలు కావడంతో…. హరికథ టైటిల్ పై ఆ ఎఫెక్ట్ పడింది. ఓకే…టైటిల్ సంగతి అటుంచితే… సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో…. జనవరి 1న మూవీ విడుదలకు సిద్ధంకానుంది. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫిక్ట్‌ ఇచ్చారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు మంచి […]

ఈ శైలజ చాలా క్లీన్...
X
రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా నేను శైలజ. మొన్నటివరకు హరికథ అనే టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను నేను శైలజగా మార్చారు. శివమ్ సినిమా చట్టుబండలు కావడంతో…. హరికథ టైటిల్ పై ఆ ఎఫెక్ట్ పడింది. ఓకే…టైటిల్ సంగతి అటుంచితే… సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో…. జనవరి 1న మూవీ విడుదలకు సిద్ధంకానుంది. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫిక్ట్‌ ఇచ్చారు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో రామ్ ప్రస్తుతం ఆనందంలో ఉన్నాడు. మరోవైపు ట్రయిలర్ కు కూడా మంచి రెస్పాన్స్ రావడంతో కుర్రాడి ఖుషీ డబుల్ అయింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిట్టయితే… శివం చీకటి రాత్రుల్ని మరిచిపోవాలని భావిస్తున్నాడు రామ్. పూర్తి కుటుంబకథాచిత్రంగా తెరకెక్కిన నేను శైలజ సినిమాలో సత్యరాజ్, రోహిణి, ప్రిన్స్, శ్రీముఖి, నరేష్, ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
First Published:  28 Dec 2015 7:05 PM GMT
Next Story